ఐడీ ఉంటేనే..ఇన్‌స్టా అకౌంట్

దిశ, వెబ్ డెస్క్‌: ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కానీ, ఇక ముందు అలా కుదరదు. దాంతోపాటు ఇప్పటివరకు ఉన్న ఇన్‌స్టా అకౌంట్లలో ఏవైనా తప్పుడు సమాచారం ఉన్నా, మ్యానిప్యులేట్ చేసే అకౌంట్లు ఉన్నావాటిని తొలగించేందుకు ఇన్‌స్టా సిద్ధమవుతోంది. అందుకోసం తమ యూజర్లను ఐడెంటిటీనీ ప్రూవ్ చేసుకోవాల్సిందిగా ఇన్‌స్టా కోరనుంది. చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో సస్పీషియస్ అకౌంట్స్ మెయింటేన్ చేస్తున్నట్లు తమకు తెలిసినట్లుగా ఇన్‌స్టా పేర్కొంది. ఈ న్యూ పాలసీ వల్ల […]

Update: 2020-08-14 03:25 GMT

దిశ, వెబ్ డెస్క్‌: ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కానీ, ఇక ముందు అలా కుదరదు. దాంతోపాటు ఇప్పటివరకు ఉన్న ఇన్‌స్టా అకౌంట్లలో ఏవైనా తప్పుడు సమాచారం ఉన్నా, మ్యానిప్యులేట్ చేసే అకౌంట్లు ఉన్నావాటిని తొలగించేందుకు ఇన్‌స్టా సిద్ధమవుతోంది. అందుకోసం తమ యూజర్లను ఐడెంటిటీనీ ప్రూవ్ చేసుకోవాల్సిందిగా ఇన్‌స్టా కోరనుంది.

చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో సస్పీషియస్ అకౌంట్స్ మెయింటేన్ చేస్తున్నట్లు తమకు తెలిసినట్లుగా ఇన్‌స్టా పేర్కొంది. ఈ న్యూ పాలసీ వల్ల ఇన్ స్టా యూజర్లకు ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. కొంతమంది ప్రొఫైల్స్‌ను ఫాలో అయ్యే ఫాలోవర్స్‌లో ఎక్కువమంది ఇతర దేశీయులు ఉన్నారని, ఇలాంటి ప్రొఫైల్స్ కలిగి ఉన్న వారు తప్పకుండా తమ ఐడీని చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక ఐడీ కార్డును చూపించాలి. సస్పీషియస్ అకౌంట్‌హోల్డర్స్ ఒకవేళ ఐడీ కార్డు వెరిఫై చేసుకోకపోతే వారి అకౌంట్‌ను తొలగించాలని ఇన్‌స్టా తేల్చింది.

మరికొన్ని రోజుల్లో అమెరికాలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా ఇలాంటి క్రమశిక్షణ చర్యలు చేపట్టడం గమనార్హం. 2016లో రష్యాలో జరిగిన ఎన్నికల్లో ఇన్‌స్టాగ్రామ్ ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపినట్లు ఎండ్ గాడ్జెట్ అనే వెబ్‌సైట్ పేర్కొంది.

Tags:    

Similar News