ఇన్‌స్టాగ్రామ్ రిమెంబరింగ్ నివాళి!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి, అర్థాంతరంగా చనిపోయిన వారి ఖాతా సంగతేంటి? చనిపోయిన వారు ఎలాగూ వారి ఖాతాను నిర్వహించలేరు. వారు చనిపోయారని తెలిసినా వారి ఫాలోవర్లు అలాగే ఉంటారు. నిజం చెప్పాలంటే ఇంకా ఫాలోవర్లు పెరుగుతారు. ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలోనూ అలాగే జరిగింది. ఆయన సరైన కారణం ఏదీ చెప్పకుండా ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన ఇన్‌స్టాగ్రాం ఖాతాల్లోని పోస్టుల్లో ఏవైనా సమాధానాలు దొరుకుతాయేమోనని అందరూ వెతుకులాట మొదలుపెట్టారు. కల్మషం లేని […]
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి, అర్థాంతరంగా చనిపోయిన వారి ఖాతా సంగతేంటి? చనిపోయిన వారు ఎలాగూ వారి ఖాతాను నిర్వహించలేరు. వారు చనిపోయారని తెలిసినా వారి ఫాలోవర్లు అలాగే ఉంటారు. నిజం చెప్పాలంటే ఇంకా ఫాలోవర్లు పెరుగుతారు. ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలోనూ అలాగే జరిగింది. ఆయన సరైన కారణం ఏదీ చెప్పకుండా ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన ఇన్‌స్టాగ్రాం ఖాతాల్లోని పోస్టుల్లో ఏవైనా సమాధానాలు దొరుకుతాయేమోనని అందరూ వెతుకులాట మొదలుపెట్టారు. కల్మషం లేని నవ్వుతో ఉన్న ఫొటోలు తప్ప ఎవరికి ఏం దొరకలేదు. కానీ ఆయనను గుర్తుచేసుకుంటూ పదే పదే ఆయన ప్రొఫైల్‌ను ఓపెన్ చేశారు. చూసిన ప్రతిసారి ఆయన బతికే ఉన్నారేమో అనే ఫీలింగ్ చాలా మందికి కలిగింది. కానీ ఆయన లేరు అనే చేదు నిజాన్ని తనదైన శైలిలో ఇన్‌స్టాగ్రామ్ గుర్తుచేయడం ప్రారంభించింది.
చనిపోయినవారిని గుర్తుచేసుకుంటూ వారి ఖాతాలను మెమొరలైజ్డ్ ఖాతాలుగా ఇన్‌స్టాగ్రాం మార్చివేసింది. వారిని గుర్తుచేసుకుంటూ ప్రొఫైల్ మీద రిమెంబరింగ్ అనే పదాన్ని చేర్చింది. ఈ ఖాతాలకు ఎవరూ లాగిన్ కాకుండా చేసింది. వారు బతికున్నపుడు చేసిన పోస్టులు, కామెంట్లు అలాగే ఉంచుతుంది. అంతేకాకుండా సెర్చ్ ఫలితాల్లో ఈ మెమొరలైజ్డ్ ఖాతాలు కనిపించకుండా చేసింది. చివరగా ఉంచిన ప్రొఫైల్ ఫొటోనే ఈ ఖాతాల్లో కొనసాగించనున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ తమ బ్లాగ్ పోస్టులో పేర్కొంది. ఖాతాలు తప్పుడు వాడకానికి గురికాకుండా, చనిపోయిన వారి మీద గౌరవాన్ని ప్రకటించే ఉద్దేశంతో తాము ఈ ఫీచర్ తీసుకువచ్చినట్లు ఇన్‌స్టాగ్రామ్ పేర్కొంది.