‘టేక్ ఎ బ్రేక్’ అంటున్న ఇన్‌స్టా.. రానున్న కొత్త ఫీచర్..
దిశ, ఫీచర్స్: పని మధ్యలో బ్రేక్ తీసుకోవడం సర్వసాధారణం. చైనీయులైతే ఏకంగా తమ వర్కింగ్ హవర్స్‌లోనే చిన్నపాటి కునుకు తీసి మళ్లీ పని కొనసాగిస్తారు. అంతదాకా ఎందుకు? ఎంత గొప్ప సినిమా అయినా మధ్యలో ‘విరామం’ ఇవ్వాల్సిందే. ఇలా చాలా విషయాల్లో విశ్రాంతి కోరుకునే మనం సోషల్ మీడియాలో మాత్రం గంటల తరబడి స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఈ అలవాటును నివారించేందుకు ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్లకు ఓ కొత్త ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేయనుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ […]
దిశ, ఫీచర్స్: పని మధ్యలో బ్రేక్ తీసుకోవడం సర్వసాధారణం. చైనీయులైతే ఏకంగా తమ వర్కింగ్ హవర్స్‌లోనే చిన్నపాటి కునుకు తీసి మళ్లీ పని కొనసాగిస్తారు. అంతదాకా ఎందుకు? ఎంత గొప్ప సినిమా అయినా మధ్యలో ‘విరామం’ ఇవ్వాల్సిందే. ఇలా చాలా విషయాల్లో విశ్రాంతి కోరుకునే మనం సోషల్ మీడియాలో మాత్రం గంటల తరబడి స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఈ అలవాటును నివారించేందుకు ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్లకు ఓ కొత్త ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేయనుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుంచి విరామం తీసుకునేందుకు సాయపడే ఈ ఫీచర్‌ను కంపెనీ ‘టేక్ ఎ బ్రేక్’ అని పిలుస్తోంది.
ఫేస్‌బుక్ ఇటీవలే తన యాప్స్ పనితీరు, యూజర్స్ స్టే టైమింగ్‌పై అధ్యయనం చేయగా.. ఇవి వినియోగదారులకు వ్యసనంగా మారినట్లు వెల్లడైంది. ముఖ్యంగా ఇన్‌స్టా యూజర్స్ అంతులేని స్టోరీలతో గ్యాప్ లేకుండా గడుపుతున్నట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్ వ్యసనాన్ని నివారించేందుకు కంపెనీ హెడ్ ఆడమ్ మొస్సేరి ‘టేక్ ఏ బ్రేక్’ ఫీచర్‌ను ప్రకటించారు. 10, 20 లేదా 30 నిమిషాల పాటు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఉపయోగించిన తర్వాత కొద్దిసేపు విరామం తీసుకునేందుకు యాప్‌లో రిమైండర్స్ కోసం యూజర్లు సంబంధిత ఆప్షన్‌ను ఆన్ చేయాల్సి ఉంటుంది.
అయితే ఇది డిఫాల్ట్ సెట్టింగ్ కాదని కంపెనీ పేర్కొంది. ఇక కొత్త సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను కూడా ప్రారంభించాలని ఇన్‌స్టాగ్రామ్ యోచిస్తుండగా.. క్రియేటర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ డబ్బు సంపాదించడంలో ఇది సాయపడుతుందని టెక్ క్రంచ్ ప్రచురించిన నివేదిక వెల్లడించింది. కాగా సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు రూ.89గా ఉండొచ్చని తెలిపింది.
ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రజలకు మరింత నియంత్రణ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. సమీప భవిష్యత్తులో మా వినియోగదారులు తమకు ఉపయోగపడే మరిన్ని ఫీచర్లను చూస్తారు. కొద్దిరోజుల్లోనే దీన్ని కొంతమంది యూజర్లకు విడుదల చేసి టెస్ట్ చేస్తాం. ఫలితం బాగుంటే రాబోయే నెలల్లో అందరికీ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం.
– ఆడమ్ మోసియర్, ఇన్‌స్టాగ్రామ్ హెడ్..