ఆ శాఖల్లో తనిఖీలు.. టెన్షన్‌లో అధికారులు

దిశ, ఏపీ బ్యూరో: స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో నకిలీ చలానాల కుంభకోణం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మిగిలిన శాఖలపైనా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ల శాఖతోపాటు చలానాల ద్వారా చేసే చెల్లింపులపై జగన్ సర్కార్ విచారణ చేపట్టింది. ప్రభుత్వం ఆదేశాలతో ఎక్సైజ్, మైనింగ్, రవాణా, కార్మిక శాఖల్లో అధికారులు విచారణ చేపట్టారు. చలానాల ద్వారా వచ్చే డబ్బు సీఎఫ్ఎంఎస్‌లోనే జమవుతోందా? లేదా? అనే దానిపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయితే […]

Update: 2021-09-03 04:40 GMT

దిశ, ఏపీ బ్యూరో: స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో నకిలీ చలానాల కుంభకోణం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మిగిలిన శాఖలపైనా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ల శాఖతోపాటు చలానాల ద్వారా చేసే చెల్లింపులపై జగన్ సర్కార్ విచారణ చేపట్టింది. ప్రభుత్వం ఆదేశాలతో ఎక్సైజ్, మైనింగ్, రవాణా, కార్మిక శాఖల్లో అధికారులు విచారణ చేపట్టారు. చలానాల ద్వారా వచ్చే డబ్బు సీఎఫ్ఎంఎస్‌లోనే జమవుతోందా? లేదా? అనే దానిపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయితే రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహించాలని…అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Tags:    

Similar News