సౌతాఫ్రికా పర్యటనకు రోహిత్ దూరం.. జట్టులోకి ప్రియాంక్
దిశ, స్పోర్ట్స్: భారత జట్టు మరో నాలుగు రోజుల్లో టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా బయలు దేరాల్సి ఉండగా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. టీమ్ ఇండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా పర్యటనకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా బయలు దేరే ముందు టీమ్ఇండియా ముంబైలో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఆదివారం రోహిత్ ప్రాక్టీస్ చేసే సమయంలో త్రో డౌన్ స్పెషలిస్ట్ రఘు విసిరిన బంతి రోహిత్‌కు బలంగా తాకింది. దీంతో అతడి […]
దిశ, స్పోర్ట్స్: భారత జట్టు మరో నాలుగు రోజుల్లో టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా బయలు దేరాల్సి ఉండగా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. టీమ్ ఇండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా పర్యటనకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా బయలు దేరే ముందు టీమ్ఇండియా ముంబైలో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఆదివారం రోహిత్ ప్రాక్టీస్ చేసే సమయంలో త్రో డౌన్ స్పెషలిస్ట్ రఘు విసిరిన బంతి రోహిత్‌కు బలంగా తాకింది. దీంతో అతడి ఎడమ కాలి కండరాలకు గాయం అయ్యింది. ఆ తర్వాత రోహిత్ ప్రాక్టీస్ పూర్తి చేయకుండానే హోటల్ రూమ్‌కు వెళ్లిపోయాడు. అయితే రోహిత్ గాయంపై తాజాగా బీసీసీఐ ప్రకటన చేసింది.
‘రోహిత్ శర్మ ఆదివారం ముంబైలో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరుగనున్న మూడు టెస్టు మ్యాచ్‌లకు రోహిత్ దూరమయ్యాడు. అతడి స్థానంలో ప్రియాంక్ పాంచల్‌ను టెస్టు జట్టులో చేర్చాము’ అని బీసీసీఐ ట్వీట్ చేసింది. ఇప్పటికే ప్రియాంక్ పాంచల్‌ను బీసీసీఐ అప్రమత్తం చేసింది. పాంచల్ ఇటీవల దక్షిణాఫ్రికాలో పర్యటించిన ఇండియా ఏ జట్టుకు తొలి రెండు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
సోమవారం రాత్రికల్లా పాంచల్‌ను ముంబై హోటల్‌కు చేరుకోవల్సిందిగా బీసీసీఐ సమాచారం అందించినట్లు తెలుస్తున్నది. కాగా, రోహిత్ శర్మ గత 12 నెలల్లో కండరాల గాయంతో బాధపడటం ఇది రెండో సారి. ఐపీఎల్ 2020 తర్వాత కూడా కండరాల గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనలో రెండు టెస్టులకు దూరం అయ్యాడు. తాజాగా మరోసారి దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. టెస్టు జట్టుకు రోహిత్ శర్మను వైస్ – కెప్టెన్‌గా నియమించారు. ఇప్పుడు రోహిత్ దూరమవడంతో అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా చేసే అవకాశం ఉన్నది.