చేరాల్సిన చోటుకు జాతీయపక్షి..
దిశ, కూకట్ పల్లి: కదల్లేని స్థితిలో ఉన్న జాతీయ పక్షి నెమలిని స్థానికులు రక్షించారు. అనంతరం కూకట్ పల్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు జాతీయ పక్షిని ఠాణాకు తరలించి.. వైల్డ్ లైఫ్ సాంచురీ ప్రతినిధులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. కూకట్ పల్లి, వినోబా భావేపురం బస్తీలో శనివారం ఓ నెమలి కదలకుండా అనుమానాస్పద స్థితిలో పడి ఉంది. గుర్తించిన స్థానికులు కాలనీ అసోషియేషన్ సహకారంతో కూకట్ పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు […]
దిశ, కూకట్ పల్లి: కదల్లేని స్థితిలో ఉన్న జాతీయ పక్షి నెమలిని స్థానికులు రక్షించారు. అనంతరం కూకట్ పల్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు జాతీయ పక్షిని ఠాణాకు తరలించి.. వైల్డ్ లైఫ్ సాంచురీ ప్రతినిధులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. కూకట్ పల్లి, వినోబా భావేపురం బస్తీలో శనివారం ఓ నెమలి కదలకుండా అనుమానాస్పద స్థితిలో పడి ఉంది. గుర్తించిన స్థానికులు కాలనీ అసోషియేషన్ సహకారంతో కూకట్ పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకుని జాతీయపక్షిని పీఎస్‌కు తరలించారు. పోలీసులు పక్షికి ప్రాథమిక చికిత్స చేయించి హైదరాబాద్ వైల్డ్ లైఫ్ సాంచురీ ప్రతినిధులకు సమాచారమిచ్చారు. వెంటనే కూకట్‌పల్లి పీఎస్‌కు చేరుకున్న వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ సిబ్బంది నెమలి పరిస్థితిని పరిశీలించి వారితో పాటు తీసుకెళ్లారు. దీంతో పక్షికి మెరుగైన చికిత్స అందించి, అటవీ ప్రాంతంలో తిరిగి వదిలి పెట్టనున్నట్లు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రతినిధులు తెలిపారు.