తగ్గిన ఇండస్‌ఇండ్ నికర లాభం
ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 67.84శాతం పడిపోయి, రూ.460.04కోట్లుగా ఉందని ఇండస్ఇండ్ బ్యాంక్ పేర్కొంది. దేశంలో ఆరో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఇండస్ఇండ్ మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్ చేసింది. ఆర్థిక కార్యకలాపాల ద్వారా మొదటి త్రైమాసికంలో ఆర్జించిన ఆదాయం రూ.8,680.92 కోట్లుగా ఉన్నదని, అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 0.65శాతం అధికం అని ప్రకటించింది. ఏడాది ప్రతిపాదికన ఆర్జించిన మొత్తం వడ్డీ 2.88శాతం పెరిగి రూ.7,161.73 […]
ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 67.84శాతం పడిపోయి, రూ.460.04కోట్లుగా ఉందని ఇండస్ఇండ్ బ్యాంక్ పేర్కొంది. దేశంలో ఆరో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఇండస్ఇండ్ మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్ చేసింది. ఆర్థిక కార్యకలాపాల ద్వారా మొదటి త్రైమాసికంలో ఆర్జించిన ఆదాయం రూ.8,680.92 కోట్లుగా ఉన్నదని, అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 0.65శాతం అధికం అని ప్రకటించింది. ఏడాది ప్రతిపాదికన ఆర్జించిన మొత్తం వడ్డీ 2.88శాతం పెరిగి రూ.7,161.73 కోట్లుగా ఉన్నదని ఇండస్ఇండ్ బ్యాంక్ పేర్కొంది. మొత్తం నికర ఆదాయం రూ.3,309.19కోట్లు ఉన్నదని, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 16.3శాతం పెరిగిందని తెలిపింది. అయితే, నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) పెరిగినట్లు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎన్‌పీఏలు 2.53శాతం పెరిగాయని, ఇది అంతకుముందు త్రైమాసికంలో 2.45శాతంగా ఉన్నట్లు పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎన్‌పీఏలు 2.15శాతం ఉన్నట్లు ప్రకటించింది. ఏదిఏమైనా 2020-21 తొలి త్రైమాసికంలో నికర ఎన్‌పీఏలు 28.45శాతం తగ్గి, రూ.1,703.37కు చేరకున్నాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి బ్యాంకు కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపడంతో ఫలితాలు నిరాశజనకంగా ఉన్నాయని ఇండ్‌ఇండ్ బ్యాంక్ తెలిపింది.