మద్యాన్ని నిషేధించాలి: ఇందిరా శోభన్

దిశ, న్యూస్ బ్యూరో: మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలకు కారణమైన మద్యాన్ని నిషేధించాలని.. టీపీసీసీ అధికార ప్రతినిధి పోశాల ఇందిరా శోభన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం బెల్టు షాపులు రద్దు చేయాలని, మహిళ సంఘాలను పునరుద్ధరించాలని ఆమె తెలిపారు. అంతేకాకుండా మహిళా కమిషన్ చైర్ పర్సన్‌ను నియమించాలన్నారు. తాను చేపట్టిన నిరహార దీక్షను కరోనా వైరస్ దృష్ట్యా.. ప్రజల కోసం తాత్కాలికంగా విరమించుకుంటున్నానని ఆమె తెలిపారు. తాను చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతు పలికిన టీపీసీసీ అధ్యక్షుడు […]

Update: 2020-03-06 08:46 GMT

దిశ, న్యూస్ బ్యూరో: మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలకు కారణమైన మద్యాన్ని నిషేధించాలని.. టీపీసీసీ అధికార ప్రతినిధి పోశాల ఇందిరా శోభన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం బెల్టు షాపులు రద్దు చేయాలని, మహిళ సంఘాలను పునరుద్ధరించాలని ఆమె తెలిపారు. అంతేకాకుండా మహిళా కమిషన్ చైర్ పర్సన్‌ను నియమించాలన్నారు. తాను చేపట్టిన నిరహార దీక్షను కరోనా వైరస్ దృష్ట్యా.. ప్రజల కోసం తాత్కాలికంగా విరమించుకుంటున్నానని ఆమె తెలిపారు. తాను చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతు పలికిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, పార్టీ పెద్దలకు ఆమె ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.

tag: indira shoban, comments, ban Alcohol

Tags:    

Similar News