ఇండియ‌న్ ఆర్మీలో 10+2 ఎంట్రీ స్కీమ్‌

దిశ, వెబ్‌డెస్క్ : ఇండియన్ ఆర్మీ ప‌ర్మీనెంట్ క‌మిష‌న్ ద్వారా ఇంట‌‌ర్ అర్హత ఉన్న వారికి 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం (45వ కోర్సు) నోటిఫికేష‌న్‌ను విడుదల చేసింది. మొత్తం ఖాళీలు : 90 (ఈ కోర్సు జూలై 2021లో ప్రారంభ‌మ‌వుతుంది) అర్హత    : మ్యాథ్స్, ఫిజిక్స్ , కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత. కేవలం 70 శాతం మార్కులతో సాధించిన పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. వ‌య‌స్సు  : 16 1/2 నుంచి 19 […]

Update: 2021-02-01 10:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఇండియన్ ఆర్మీ ప‌ర్మీనెంట్ క‌మిష‌న్ ద్వారా ఇంట‌‌ర్ అర్హత ఉన్న వారికి 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం (45వ కోర్సు) నోటిఫికేష‌న్‌ను విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 90 (ఈ కోర్సు జూలై 2021లో ప్రారంభ‌మ‌వుతుంది)
అర్హత : మ్యాథ్స్, ఫిజిక్స్ , కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత. కేవలం 70 శాతం మార్కులతో సాధించిన పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వ‌య‌స్సు : 16 1/2 నుంచి 19 1/2 ఏండ్ల మ‌ధ్య ఉండాలి. అన‌గా 2 జ‌న‌వ‌రి 2002 నుంచి 1, జ‌న‌వ‌రి 2005 మ‌ధ్య జ‌న్మించాలి.
ఎంపిక : సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (SSB) నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా (ఇంట‌ర్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా) ఇంటర్వ్యూకు పిలిచి ఎంపిక చేస్తారు. మొత్తం ఐదేండ్ల‌పాటు ట్రెయినింగ్ ఉంటుంది. ఇందులో ఏడాదిపాటు గయలోని ఆఫీస‌ర్ ట్రైనింగ్ అకాడమీలో ప్రాథమిక శిక్షణ అందిస్తారు. CME పుణె లేదా MCEME సికింద్రాబాద్ లేదా MCTE మౌ ల‌లో టెక్నిక‌ల్ ట్రెయినింగ్ ఫేజ్1 (ప్రీ క‌మిష‌న్ ట్రెయినింగ్‌) మూడేండ్ల‌పాటు ఉంటుంది. మ‌రో ఏడాదిపాటు ఫేజ్‌2 (పోస్టు క‌మిష‌న్ ట్రెయినింగ్‌) MCTE మౌ లేదా MCEME సికింద్రాబాద్‌లో టెక్నిక‌ల్ ట్రెయినింగ్ ఇస్తారు. విజయవంతంగా పూర్తిచేసిన వారికి లెఫ్టినెంట్ హోదాతో కల్పిస్తారు.
పే స్కేల్ ‌: రూ. 56,100-1.77.500 (లెఫ్టినెంట్ హోదాలో)
చివరి తేదీ : మార్చి 2, 2021
వెబ్‌సైట్‌ : https://joinindianarmy.nic.in

Tags:    

Similar News