ఇండిగోలో 10 శాతం ఉద్యోగుల తొలగింపు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో తన ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది. కొవిడ్-19 ప్రభావంతోనే ఈ తొలగింపు ప్రక్రియ జరుగుతోందని కంపెనీ సీఈవో రోనన్‌జోయ్ దత్తా వెల్లడించారు. కరోనా లాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఎన్నోకొన్ని త్యాగాలు చేయకుండా సంస్థను ముందుకు తీసుకెళ్లడం అసాధ్యమని రోనన్‌జోయ్ తెలిపారు. అందుకే, సాధ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకుని సంస్థలోని 10 శాతం మందిని తొలగించాలనే బాధాకరమైన నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో తన ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది. కొవిడ్-19 ప్రభావంతోనే ఈ తొలగింపు ప్రక్రియ జరుగుతోందని కంపెనీ సీఈవో రోనన్‌జోయ్ దత్తా వెల్లడించారు. కరోనా లాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఎన్నోకొన్ని త్యాగాలు చేయకుండా సంస్థను ముందుకు తీసుకెళ్లడం అసాధ్యమని రోనన్‌జోయ్ తెలిపారు. అందుకే, సాధ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకుని సంస్థలోని 10 శాతం మందిని తొలగించాలనే బాధాకరమైన నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇండిగో చరిత్రలో తొలిసారిగా జరుగుతోందని రోనన్‌జోయ్ వివరించారు. కరోనా సంక్షోభం కారణంగా ప్రస్తుతం దేశీయ విమానయాన సంస్థలు 45 శాతం సామర్థ్యంతోనే పని చేస్తున్నాయి. ఇండిగో తన మొత్తం 250 విమానాల్లో చాలా కొద్ది శాతం మత్రమే విమానాలు పని చేస్తున్నాయని కంపెనీ వెల్లడించింది. మే నుంచి జూలై వరకు పరిమిత, గ్రేడ్ లీవ్ కింద ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నట్టు కంపెనీ ఇంతకుముందే ప్రకటించింది. ఇండిగో సీఈవో రోనన్‌జోయ్ దత్తా ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో ఈ మూడు నెలలకు వేతనాల్లో కోత విధించడం తప్ప మరో మార్గంలేదని పేర్కొన్నారు.