రికార్డులతో దూసుకెళ్తున్న మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస రికార్డులతో దూసుకెళ్తోంది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, దేశీయ ఈక్విటీల్లో ఎఫ్‌పీఐ నిధుల ప్రవాహంతో మార్కెట్ల జోరు కొనసాగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఆర్థికవ్యవస్థలు కరోనా సంక్షోభం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న సంకేతాలు కూడా దేశీయంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు దోహదపడని, దీంతో కొనుగోళ్లకు సిద్ధపడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. గురువారం ఉదయం నుంచే సూచీలు లాభాలను స్పీడ్‌ను అందుకోగా […]

Update: 2020-12-17 06:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస రికార్డులతో దూసుకెళ్తోంది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, దేశీయ ఈక్విటీల్లో ఎఫ్‌పీఐ నిధుల ప్రవాహంతో మార్కెట్ల జోరు కొనసాగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఆర్థికవ్యవస్థలు కరోనా సంక్షోభం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న సంకేతాలు కూడా దేశీయంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు దోహదపడని, దీంతో కొనుగోళ్లకు సిద్ధపడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. గురువారం ఉదయం నుంచే సూచీలు లాభాలను స్పీడ్‌ను అందుకోగా చివరి వరకు అదే ధోరణిని కొనసాగించింది. ఈ వారంలో వరుసగా నమోదవుతున్న జీవితకాల గరిష్ఠం గురువారం కూడా కొనసాగింది.

మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 223.88 పాయింట్లు ఎగసి 46,890 వద్ద ముగియగా, నిఫ్టీ 58 పాయింట్లు లాభపడి 13,740 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఫార్మా, ప్రైవేట్ బ్యాంకులు, రియల్టీ రంగాలు పుంజుకోగా, మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, మీడియా, ఆటో రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, పవర్‌గ్రిడ్, టీసీఎస్, టీసీఎస్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఓఎన్‌జీసీ, మారుతీ సుజుకి, టాటా స్టీల్, హిందూస్తాన్ యూనిలీవర్, బజాజ్ ఆటో, సన్‌ఫార్మా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.56 వద్ద ఉంది.

Tags:    

Similar News