సానుకూలంగా సేవల రంగ కార్యకలాపాలు

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది సెప్టెంబెర్ నెలలో సేవల రంగ కార్యకలాపాలు సానుకూలంగా ఉన్నట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొవిడ్ ఆంక్షలు తగ్గిపోవడం, డిమాండ్ పెరుగుతున్న కారణంగా సమీక్షించిన నెలలో సేవల రంగ పీఎంఐ 55.2 పాయింట్లుగా నమోదైంది. అయితే ఆగస్ట్ తో పోలిస్తే సేవల రంగ పర్చేజింగ్ మేనేజర్ ఇండెక్స్(పీఎంఐ) స్వల్పంగా తగ్గింది. ఆగస్ట్ లో పీఎంఐ 18 నెలల గరిష్ఠానికి 56.7గా నమోదైన సంగతి తెలిసిందే. సాధారణంగా పీఎంఐ సూచీ 50కి […]

Update: 2021-10-05 09:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది సెప్టెంబెర్ నెలలో సేవల రంగ కార్యకలాపాలు సానుకూలంగా ఉన్నట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొవిడ్ ఆంక్షలు తగ్గిపోవడం, డిమాండ్ పెరుగుతున్న కారణంగా సమీక్షించిన నెలలో సేవల రంగ పీఎంఐ 55.2 పాయింట్లుగా నమోదైంది. అయితే ఆగస్ట్ తో పోలిస్తే సేవల రంగ పర్చేజింగ్ మేనేజర్ ఇండెక్స్(పీఎంఐ) స్వల్పంగా తగ్గింది. ఆగస్ట్ లో పీఎంఐ 18 నెలల గరిష్ఠానికి 56.7గా నమోదైన సంగతి తెలిసిందే. సాధారణంగా పీఎంఐ సూచీ 50కి పైన నమోదైతే సానుకూల వృద్ధిని కలిగి ఉన్నట్టు, 50కి దిగువన ఉంటే క్షీణతగా భావిస్తారు. కొవిడ్ నిబంధనలు సడలించడంతో దేశంలోని సేవల రంగంలో చాలావరకు సంస్థలు వ్యాపారాలను గణనీయంగా నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతానికి వ్యాపార విశ్వాసం ప్రతికూలంగానే ఉన్నప్పటికీ, రానున్న రోజుల్లో ఇది కూడా మెరుగవుతుందని నివేదిక అభిప్రాయపడింది. ఈ రంగంలోని ఉద్యోగాలు కూడా గత నెలలో మెరుగైన వృద్ధి సాధించినట్టు ఐహెచ్​ఎస్ మార్కిట్ తన నెలవారీ నివేదికలో తెలిపింది. సేవల రంగంలో ఉద్యోగాలకు సంబంధించి గడిచిన 9 నెలలుగా క్షీణత ఉందని, సెప్టెంబర్‌లో ఉపాధి అవకాశాలు పెరిగాయని నివేదిక పేర్కొంది. కొవిడ్ సంబంధిత ప్రభావాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రంగంలోని సంస్థలు అవసరమైన మేరకే సిబ్బందిని తీసుకుంటున్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News