బంగారం దిగుమతుల్లో 471 శాతం వృద్ధి!

దిశ, వెబ్‌డెస్క్: భారత్ మార్చి నెలలో రికార్డు స్థాయిలో బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా ఉన్న భారత్‌లో గత నెల పసిడి దిగుమతులు ఏకంగా 471 శాతం పెరిగి 160 టన్నులకు చేరుకున్నాయి. బంగారం ధరలు రికార్డు స్థాయి నుంచి తగ్గిపోవడం, దిగుమతి పన్నులను తగ్గించిన నేపథ్యంలో జ్యువెలరీ, రిటైల్ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది ఆగష్టులో ఆల్-టైమ్ రికార్డు […]

Update: 2021-04-02 06:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్ మార్చి నెలలో రికార్డు స్థాయిలో బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా ఉన్న భారత్‌లో గత నెల పసిడి దిగుమతులు ఏకంగా 471 శాతం పెరిగి 160 టన్నులకు చేరుకున్నాయి. బంగారం ధరలు రికార్డు స్థాయి నుంచి తగ్గిపోవడం, దిగుమతి పన్నులను తగ్గించిన నేపథ్యంలో జ్యువెలరీ, రిటైల్ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

గతేడాది ఆగష్టులో ఆల్-టైమ్ రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు దాదాపు 17 శాతం తగ్గాయి. అయితే, బంగారం దిగుమతులు పెరగడం వల్ల దేశ వాణిజ్య లోటు ప్రభావితమవుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇక, మార్చితో ముగిసిన త్రైమాసికంలో కూడా పసిడి దిగుమతులు రికార్డు స్థాయిలో 321 టన్నులుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో 124 టన్నులే దిగుమతి కావడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో కేంద్రం రిటైల్ డిమాండ్ పెంచేందుకు, అక్రమ రవాణాను తగ్గించేందుకు బంగారంపై దిగుమతి సుంకాలను 10.75 శాతానికి తగ్గించింది. బంగారం ధరలు కూడా బాగా తగ్గిపోవడంతో వినియోగదారులు కొనుగోళ్లకు సిద్ధపడుతున్నారని జేజే గోల్డ్ హౌస్ యజమాని హర్షద్ వెల్లడించారు.

Tags:    

Similar News