స్లోగా రికవరీ : నోమురా

దిశ, వెబ్‌డెస్క్: ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ -15.2 శాతంతో అత్యల్ప వృద్ధిని నమోదు చేస్తుందని బుధవారం నోమురా నివేదిక తెలిపింది. భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ త్రైమాసికంలోనూ సానుకూల వృద్ధిని సాధించే అవకాశాల్లేవని, ఫలితంగా 2020-21కి -6.1 శాతమే నమోదవచ్చని జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ నోమురా అంచనావేసింది. రెండో త్రైమాసికంలో కూడా వృద్ధి తక్కువగానే ఉంటుందని నివేదిక పేర్కొంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహన అమ్మకాలు, […]

Update: 2020-08-26 04:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ -15.2 శాతంతో అత్యల్ప వృద్ధిని నమోదు చేస్తుందని బుధవారం నోమురా నివేదిక తెలిపింది. భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ త్రైమాసికంలోనూ సానుకూల వృద్ధిని సాధించే అవకాశాల్లేవని, ఫలితంగా 2020-21కి -6.1 శాతమే నమోదవచ్చని జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ నోమురా అంచనావేసింది. రెండో త్రైమాసికంలో కూడా వృద్ధి తక్కువగానే ఉంటుందని నివేదిక పేర్కొంది.

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహన అమ్మకాలు, మూధన పెట్టుబడులు, ఉక్కు ఉత్పత్తి, దిగుమతులు, రైల్వే, విమానయాన ప్రయాణీకుల రద్దీ వంటి వాటి పనితీరులో పదునైన క్షీణత ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. జులైలో పరిస్థితులు మెరుగుపడినప్పటికీ, రికవరీ ఊహించిన స్థాయిలో లేదు. ఇది కరోనాకు ముందునాటి మొత్తం సరఫరా స్థాయిలో 82 శాతానికి చేరుకుంది. అలాగే, మొత్తం డిమాండ్ 62 శాతంగా ఉన్నట్టు నివేదిక అభిప్రాయపడింది. పెరుగుతున్న ఆదాయ అనిశ్చితి మధ్య వినియోగదారుల జాగ్రత్త కారణంగా డిమాండ్ క్షీణించింది. మరోవైపు లాక్‌డౌన్ వల్ల సరఫరా పరిమితంగా ఉంది. పట్టణంతో పోలిస్తే గ్రామీణ వినియోగం వేగంగా వృద్ధి చెందిందని నివేదిక పేర్కొంది.

Tags:    

Similar News