పెరిగిన ఫారెక్స్ నిల్వలు!

దిశ, వెబ్‌డెస్క్: దేశ విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు గణనీయంగా పెరిగాయి. అక్టోబర్ 29తో ముగిసిన వారానికి భారత ఫారెక్స్ నిల్వలు 1.919 బిలియన్ డాలర్లు(రూ. 14.24 వేల కోట్లు) పెరిగి 642.019 బిలియన్ డాలర్ల(రూ. 48 లక్షల కోట్ల)కు చేరుకున్నాయని శుక్రవారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. కరెన్సీ ఆస్తులు, బంగారం విలువ పెరుగుదలే ఇందుకు కారణమని ఆర్‌బీఐ పేర్కొంది. అంతకుముందు వారంలో ఫారెక్స్ నిల్వలు 908 మిలియన్లు(రూ. 6,740 కోట్లు) తగ్గి […]

Update: 2021-11-05 10:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు గణనీయంగా పెరిగాయి. అక్టోబర్ 29తో ముగిసిన వారానికి భారత ఫారెక్స్ నిల్వలు 1.919 బిలియన్ డాలర్లు(రూ. 14.24 వేల కోట్లు) పెరిగి 642.019 బిలియన్ డాలర్ల(రూ. 48 లక్షల కోట్ల)కు చేరుకున్నాయని శుక్రవారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. కరెన్సీ ఆస్తులు, బంగారం విలువ పెరుగుదలే ఇందుకు కారణమని ఆర్‌బీఐ పేర్కొంది.

అంతకుముందు వారంలో ఫారెక్స్ నిల్వలు 908 మిలియన్లు(రూ. 6,740 కోట్లు) తగ్గి 640.1 బిలియన్ డాలర్ల(రూ. 47.51 లక్షల కోట్లు)కు చేరాయి. మొత్తం నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.363 బిలియన్ డాలర్లు(రూ. 10.1 వేల కోట్లు) పెరిగి 578.462 బిలియన్ డాలర్ల(రూ. 43 లక్షల కోట్ల)కు చేరుకున్నాయని ఆర్‌బీఐ గణాంకాలు పేర్కొన్నాయి. సమీక్షించిన వారంలో బంగారం నిల్వలు 572 మిలియన్ డాలర్లు(రూ. 4,246 కోట్లు) పెరిగి 39.012 బిలియన్ డాలర్ల(రూ. 2.89 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి.

Tags:    

Similar News