టీమ్ ఇండియా వ్యూహాలను ఛేదించాలి : లబుషేన్

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో ఘోర పరాజయం తర్వాత బాక్సింగ్ డే టెస్టులో అనూహ్యంగా పుంజుకుంది. కెప్టెన్ అజింక్య రహానే బౌలర్లను సమర్దవంతంగా వినియోగించుకోవడమే కాకుండా.. ఆసీస్ బ్యాట్స్‌మాన్‌ను అవుట్ చేయడానికి ప్రత్యేక వ్యూహంతో ఫీల్డర్లను మోహరించాడు. ముఖ్యంగా స్టీవ్ స్మిత్, లబుషేన్, పైన్, బర్న్స్ వంటి ఆటగాళ్లను అవుట్ చేయడానికి లెగ్ సైట్ వైపు ఫీల్డర్లను మోహరించి ఫలితం సాధించాడు. ఫీల్డర్లను ఎక్కువగా ఆన్‌సైడే నిలిపి.. బౌలర్లతో కూడా అటువైపు కొట్టేలా బంతులు […]

Update: 2021-01-01 09:48 GMT

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో ఘోర పరాజయం తర్వాత బాక్సింగ్ డే టెస్టులో అనూహ్యంగా పుంజుకుంది. కెప్టెన్ అజింక్య రహానే బౌలర్లను సమర్దవంతంగా వినియోగించుకోవడమే కాకుండా.. ఆసీస్ బ్యాట్స్‌మాన్‌ను అవుట్ చేయడానికి ప్రత్యేక వ్యూహంతో ఫీల్డర్లను మోహరించాడు. ముఖ్యంగా స్టీవ్ స్మిత్, లబుషేన్, పైన్, బర్న్స్ వంటి ఆటగాళ్లను అవుట్ చేయడానికి లెగ్ సైట్ వైపు ఫీల్డర్లను మోహరించి ఫలితం సాధించాడు. ఫీల్డర్లను ఎక్కువగా ఆన్‌సైడే నిలిపి.. బౌలర్లతో కూడా అటువైపు కొట్టేలా బంతులు వేయించాడు. దీంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్ పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. కాస్త సాహసించి షాట్లు ఆడుదామనుకొని ఏకంగా వికెట్లు పారేసుకున్నారు.

టీమ్ ఇండియా పన్నిన ఈ లెగ్ సైడ్ వ్యూహాన్ని తప్పకుండా ఛేదించాలని ఆసీస్ బ్యాట్స్‌మాన్ లబుషేన్ అంటున్నాడు. మూడో టెస్టులో ఈ వ్యూహానికి పరిష్కారం కనుగొనకపోతే పరుగులు చేయడం కష్టంగా మారుతుందని అభిప్రాయపడ్డాడు. స్టీవ్ స్మిత్ వంటి బ్యాట్స్‌మెన్‌ను కూడా బోల్తా కొట్టించారంటే టీమ్ ఇండియా ఎంత కసరత్తు చేసి మైదానంలోకి దిగిందో అర్థం చేసుకోవచ్చని లబుషేన్అంటున్నాడు. స్మిత్ ఈ వుచ్చు నుంచి త్వరగానే బయటపడి ఫామ్ అందుకుంటాడని, డేవిడ్ వార్నర్ రాకతో బ్యాటింగ్ బలం పెరిగడంతో గట్టి పోటీ ఇవ్వగలమని లబుషేన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Tags:    

Similar News