ఏసియన్ ఆర్చరీ చాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో టీమ్ ఇండియా
దిశ, స్పోర్ట్స్: ఢాకా వేదికగా జరుగుతున్న ఏసియా ఆర్చరీ చాంపియన్‌షిప్స్ 2021 ఫైనల్స్‌లో భారత పురుషుల, మహిళ రికర్వ్ జట్లు ఫైనల్ చేరుకున్నాయి. ప్రవీణ్ జాదవ్, పార్థ్ సాలుంకే, కపిల్‌ల బృందానికి తొలి రౌండ్‌లో బై లభించింది. ఇక క్వార్టర్ ఫైనల్స్‌లో సౌదీ అరేబియా జట్టును 6-0తో ఓడించిన భారత ఆర్చర్ల బృందం.. సెమీస్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌పై 5-4 తేడాతో షూట్ ఆఫ్‌లో గెలిచారు. ఈ విజయంతో పురుషుల బృందం ఫైనల్‌కు చేరుకున్నది. ఫైనల్స్‌లో బలమైన దక్షిణ […]
దిశ, స్పోర్ట్స్: ఢాకా వేదికగా జరుగుతున్న ఏసియా ఆర్చరీ చాంపియన్‌షిప్స్ 2021 ఫైనల్స్‌లో భారత పురుషుల, మహిళ రికర్వ్ జట్లు ఫైనల్ చేరుకున్నాయి. ప్రవీణ్ జాదవ్, పార్థ్ సాలుంకే, కపిల్‌ల బృందానికి తొలి రౌండ్‌లో బై లభించింది. ఇక క్వార్టర్ ఫైనల్స్‌లో సౌదీ అరేబియా జట్టును 6-0తో ఓడించిన భారత ఆర్చర్ల బృందం.. సెమీస్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌పై 5-4 తేడాతో షూట్ ఆఫ్‌లో గెలిచారు. ఈ విజయంతో పురుషుల బృందం ఫైనల్‌కు చేరుకున్నది. ఫైనల్స్‌లో బలమైన దక్షిణ కొరియాతో శుక్రవారం తలపడనున్నది. ఇక మహిళల రికర్వ్‌లో అంకిత్ భకత్, రిథీ ఫోర్, మధు వేద్వాన్ బృందానికి అదృష్టం కలిసి వచ్చింది. క్వార్టర్ ఫైనల్‌లో భారత మహిళా ఆర్చర్ల బృందానికి బై లభించింది. ఇక సెమీఫైనల్‌లో వియత్నాంను 6-0 తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకున్నది. మహిళల ఆర్చర్ల బృందం కూడా శుక్రవారం జరుగనున్న ఫైనల్‌లో బలమైన దక్షిణ కొరియాతో తలపడనున్నది.