ఆ కంపెనీ డైరక్టర్లుగా చిరు వ్యాపారులు..
దిశ, వెబ్‌డెస్క్ : చైనా ఆన్‌లైన్ కంపెనీ కేసును సీసీఎస్ పోలీసులు విచారిస్తుండగా, అందులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. చైనాకు చెందిన బెట్టింగ్ కంపెనీల్లో డైరక్టర్లుగా భారత్‌కు చెందిన చిరువ్యాపారులు ఉన్నట్లు వెల్లడైంది. ఢిల్లీ, గుర్గావ్‌కు చెందిన ఛాయ్ వాలా, ఇస్త్రీవాలా, మెకానిక్‌లను డైరక్టర్లుగా చూపుతూ ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యాపారం సాగిస్తున్నారు. డాకీ పే, లింక్ యూ కంపెనీతో పాటు 30 కంపెనీల్లో చిరు వ్యాపారులే డైరక్టర్లుగా ఉన్నట్లు తేలింది. ఈ కంపెనీలు దేశవ్యాప్తంగా రూ.2వేల […]
దిశ, వెబ్‌డెస్క్ :
చైనా ఆన్‌లైన్ కంపెనీ కేసును సీసీఎస్ పోలీసులు విచారిస్తుండగా, అందులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. చైనాకు చెందిన బెట్టింగ్ కంపెనీల్లో డైరక్టర్లుగా భారత్‌కు చెందిన చిరువ్యాపారులు ఉన్నట్లు వెల్లడైంది. ఢిల్లీ, గుర్గావ్‌కు చెందిన ఛాయ్ వాలా, ఇస్త్రీవాలా, మెకానిక్‌లను డైరక్టర్లుగా చూపుతూ ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యాపారం సాగిస్తున్నారు.
డాకీ పే, లింక్ యూ కంపెనీతో పాటు 30 కంపెనీల్లో చిరు వ్యాపారులే డైరక్టర్లుగా ఉన్నట్లు తేలింది. ఈ కంపెనీలు దేశవ్యాప్తంగా రూ.2వేల కోట్లకు పైగా ఆన్‌లైన్ బెట్టింగ్ మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. కాగా,ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది.