జో బైడెన్ సర్జన్ జనరల్‌గా భారత సంతతి డాక్టర్.. కన్నడికుడికి కీలక బాధ్యతలు
దిశ, వెబ్‌డెస్క్: యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ పాలనా పగ్గాలు చేపట్టినప్పట్నుంచి పరిపాలనా విభాగాలతో పాటు అత్యున్నత పదవులలో భారత సంతతి వ్యక్తులే నియమితులవుతున్నారు. తాజాగా మరో భారత సంతతి వ్యక్తి డాక్టర్ వివేక్ మూర్తి.. బైడెన్ సర్జన్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు యూఎస్ సెనేట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. వివేక్ మూర్తిని అధ్యక్షుడి సర్జన్ జనరల్‌గా నియమించేందుకు గాను యూఎస్ సెనేట్‌లో ఓటింగ్ ప్రవేశపెట్టారు. ఈ ఓటింగ్‌లో 57 మంది వివేక్‌కు అనుకూలంగా ఓటేశారు. […]
దిశ, వెబ్‌డెస్క్: యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ పాలనా పగ్గాలు చేపట్టినప్పట్నుంచి పరిపాలనా విభాగాలతో పాటు అత్యున్నత పదవులలో భారత సంతతి వ్యక్తులే నియమితులవుతున్నారు. తాజాగా మరో భారత సంతతి వ్యక్తి డాక్టర్ వివేక్ మూర్తి.. బైడెన్ సర్జన్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు యూఎస్ సెనేట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
వివేక్ మూర్తిని అధ్యక్షుడి సర్జన్ జనరల్‌గా నియమించేందుకు గాను యూఎస్ సెనేట్‌లో ఓటింగ్ ప్రవేశపెట్టారు. ఈ ఓటింగ్‌లో 57 మంది వివేక్‌కు అనుకూలంగా ఓటేశారు. 47 మంది వ్యతిరేకించారు. దీంతో ఆయనను బైడెన్‌కు సర్జన్‌గా నియమిస్తున్నట్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. బైడెన్ ఇటీవలే విమానం ఎక్కుతూ మూడు సార్లు కాలి జారి పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన రెండ్రోజులకే వివేక్ మూర్తి నియామకం అవడం గమనార్హం.
United States Senate votes 57-43 to confirm Indian-American physician Vivek Murthy to be President Joe Biden's surgeon general.
"I look forward to working with you to help our nation heal and create a better future for our children," Murthy says. pic.twitter.com/Ao8mKsFK0P
— ANI (@ANI) March 24, 2021
వివేక్ మూర్తి ప్రొఫైల్ : ఇండో అమెరికన్ అయిన వివేక్ మూర్తి పూర్తి పేరు వివేక్ హల్లెగెరె మూర్తి. తల్లిదండ్రులు డాక్టర్ లక్ష్మీనరసింహ మూర్తి, మైత్రేయి. కర్నాటక రాష్ట్రంలోని మైసూర్ ప్రాంతానికి చెందిన లక్ష్మీనరసింహ మూర్తి.. భారత్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. వివేక్ తాత లక్ష్మీనారాయణ మూర్తి మైసూర్ షుగర్ కంపెనీలో డైరెక్టర్‌గా ఉండేవారు. 1977లో యార్క్‌షైర్ (యూకె) లో జన్మించిన వివేక్ మూర్తి హర్వర్డ్, యేల్ వంటి ప్రముఖ యూనివర్సిటీలలో చదివారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా ఆయన సర్జన్ జనరల్‌గా ఉండేవారు. తాజాగా బైడెన్ నేతృత్వంలోని కోవిడ్-19 అడ్వైజరీ బోర్డు కో చైర్మెన్‌గా కొనసాగుతున్నారు.