యుద్ధానికి సిద్ధమంటున్న ఇండియన్ నేవీ

న్యూఢిల్లీ: భారత సముద్ర జలాల్లో వ్యూహాత్మక రక్షణకు పోరాటానికి నేవీ సంసిద్ధంగా ఉన్నది. అరేబియా సముద్రంలో ఓ పాత నౌకను అత్యంత కచ్చితత్వంగా ధ్వంసం చేసి నీట ముంచిన క్షిపణి ప్రయోగానికి సంబంధించిన వీడియోను ఇండియన్ నేవీ విడుదల చేసింది. ఆ మిసైల్‌ను ఐఎన్ఎస్ ప్రబల్ నుంచి ప్రయోగించారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, యుద్ధ నౌకలు, హెలికాప్టర్లను ధ్వంసం చేసే ఆయుధాలు, ఇతర రక్షణ సంపత్తితో భారత్ మెగా నావల్ డ్రిల్ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగానే క్షిపణి ప్రయోగం […]

Update: 2020-10-23 05:50 GMT

న్యూఢిల్లీ: భారత సముద్ర జలాల్లో వ్యూహాత్మక రక్షణకు పోరాటానికి నేవీ సంసిద్ధంగా ఉన్నది. అరేబియా సముద్రంలో ఓ పాత నౌకను అత్యంత కచ్చితత్వంగా ధ్వంసం చేసి నీట ముంచిన క్షిపణి ప్రయోగానికి సంబంధించిన వీడియోను ఇండియన్ నేవీ విడుదల చేసింది. ఆ మిసైల్‌ను ఐఎన్ఎస్ ప్రబల్ నుంచి ప్రయోగించారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, యుద్ధ నౌకలు, హెలికాప్టర్లను ధ్వంసం చేసే ఆయుధాలు, ఇతర రక్షణ సంపత్తితో భారత్ మెగా నావల్ డ్రిల్ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగానే క్షిపణి ప్రయోగం జరిగింది. అనేక తీరప్రాంతాలు, సముద్ర జలాల్లోనూ భారత నావికా దళ సన్నద్ధతను చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మైరల్ కరంబిర్ సింగ్ గురువారం సమీక్షించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News