రామ్‌దేవ్ బాబాపై రూ.1000 కోట్ల పరువు నష్టం దావా : IMA
దిశ, వెబ్‌డెస్క్ : యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసింది. రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలకు 15 రోజుల్లోగా లిఖిత పూర్వక క్షమాపణ చెప్పలని లేనియెడల పరువు నష్టం కింద రూ. వెయ్యి కోట్లు చెల్లించాలని ఐఎంఏ డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా యోగా గురువుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి ఐఎంఏ లేఖ రాసింది. ఇదిలాఉండగా అల్లోపతి పనికిమాలిన వైద్యమంటూ రామ్ దేవ్ వ్యాఖ్యలు […]
దిశ, వెబ్‌డెస్క్ : యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసింది. రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలకు 15 రోజుల్లోగా లిఖిత పూర్వక క్షమాపణ చెప్పలని లేనియెడల పరువు నష్టం కింద రూ. వెయ్యి కోట్లు చెల్లించాలని ఐఎంఏ డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా యోగా గురువుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి ఐఎంఏ లేఖ రాసింది.
ఇదిలాఉండగా అల్లోపతి పనికిమాలిన వైద్యమంటూ రామ్ దేవ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రమంత్రి హర్షవర్ధన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే రామ్ దేవ్ బాబా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించినా లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాలని ఐఎంఏ డిమాండ్ చేస్తోంది.