'వృద్ధి కొలమానం'పై నివేదిక : భారత ఉద్యోగుల్లో వృద్ధి కొరవడింది

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఉద్యోగాలు చేస్తున్నవారు మెరుగైన పనితీరుని కొనసాగిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో వృద్ధి సాధించడం పట్ల వెనకబడి ఉన్నారని ప్రముఖ అమెరికా సంస్థ గాలప్ వెల్లడించింది. ఇది ప్రపంచ సగటుతో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉందని సంస్థ అభిప్రాయపడింది. భవిష్యత్తులో వృత్తి పరంగా ఏ స్థాయికి చేరుకోవాలనే ‘వృద్ధి కొలమానం’పై నివేదిక రూపొందించిన సంస్థ ఈ అంశంలో ప్రపంచ సగటు 32 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ఇందులో దక్షిణాసియా దేశాలైన భారత్, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌ల […]

Update: 2021-06-16 05:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఉద్యోగాలు చేస్తున్నవారు మెరుగైన పనితీరుని కొనసాగిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో వృద్ధి సాధించడం పట్ల వెనకబడి ఉన్నారని ప్రముఖ అమెరికా సంస్థ గాలప్ వెల్లడించింది. ఇది ప్రపంచ సగటుతో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉందని సంస్థ అభిప్రాయపడింది. భవిష్యత్తులో వృత్తి పరంగా ఏ స్థాయికి చేరుకోవాలనే ‘వృద్ధి కొలమానం’పై నివేదిక రూపొందించిన సంస్థ ఈ అంశంలో ప్రపంచ సగటు 32 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ఇందులో దక్షిణాసియా దేశాలైన భారత్, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌ల సగటు 21 శాతంగా ఉంది. ఒక్క భారత్‌లోనే కేవలం 14 శాతం మంది మాత్రమే భవిష్యత్తులో మరింత వృద్ధి సాధించాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నారని గాలప్ పేర్కొంది.

దేశీయ ఉద్యోగుల్లో 46 శాతం మంది రోజూ చేసే పనిలో ఆందోళనను ఎదుర్కొంటున్నట్టు స్పష్టం చేశారు. 33 శాతం పని సమయాల్లో కోపాన్ని అదుపుచేయలేకపోతున్నామని, 37 శాతం మంది ఇంకా ఇతర ఇబ్బందులకు గురవుతున్నట్టు స్పష్టం చేశారు. ఒత్తిడికి సంబంధించి భారత్‌లోని ఉద్యోగులు తక్కువగానే ఉన్నారు. ఉద్యోగుల విషయంలో నిర్వహాకులు ఈ అంశాలను పరిష్కరించాలని గాలప్ నివేదిక అభిప్రాయపడింది. పెరుగుతున్న ఆందోళన, ఇతర ఒత్తిడుల వల్ల మున్ముందు వారి పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉందని వివరించింది. ఈ అభిప్రాయాలను 2020లో మొత్తం 116 దేశాల నుంచి సేకరించామని గాలప్ వెల్లడించింది.

Tags:    

Similar News