వెంటిలేటర్లు తయారుచేయనున్న భారత కంపెనీలు
దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్-19 కోసం ప్రత్యేకంగా రూపొందించనున్న వెంటిలేటర్ల తయారీకి హైదరాబాద్‌కు చెందిన మూడు కంపెనీలకు అనుమతి లభించింది. కీలకమైన వెంటిలేటర్ల తయారీకి నాసాతో కలిసి ఉత్పత్తి చేసేందుకు ఒప్పందాలు కుదిరాయి. యూఎస్-భారత్ భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ కీలక అంశంలో దేశ వ్యాప్తంగా మూడు కంపెనీలకే లైసెన్సులు లభించాయి. ప్రపంచ వ్యాప్తంగా 21 కంపెనీలు ఎంపికయ్యాయి. సదరన్ కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రపల్సన్ ల్యాబరేటరీకి 100 దరఖాస్తులు అందాయి. అందులో 8 యూఎస్ ఉత్పాదక సంస్థలకు కరోనా […]
దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్-19 కోసం ప్రత్యేకంగా రూపొందించనున్న వెంటిలేటర్ల తయారీకి హైదరాబాద్‌కు చెందిన మూడు కంపెనీలకు అనుమతి లభించింది. కీలకమైన వెంటిలేటర్ల తయారీకి నాసాతో కలిసి ఉత్పత్తి చేసేందుకు ఒప్పందాలు కుదిరాయి. యూఎస్-భారత్ భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ కీలక అంశంలో దేశ వ్యాప్తంగా మూడు కంపెనీలకే లైసెన్సులు లభించాయి. ప్రపంచ వ్యాప్తంగా 21 కంపెనీలు ఎంపికయ్యాయి. సదరన్ కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రపల్సన్ ల్యాబరేటరీకి 100 దరఖాస్తులు అందాయి. అందులో 8 యూఎస్ ఉత్పాదక సంస్థలకు కరోనా వైరస్ రోగులకు సరిపోయే కొత్త వెంటిలేటర్ల తయారీకి ఎంపికయ్యాయి. ఇండియా నుంచి ఆల్ఫా డిజైన్ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేటు లిమిటెడ్, క్యూరాసిగ్నా సిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలు మాత్రమే ఎంపికయ్యాయి. ఇందులో మొదటి మూడు కంపెనీలు కూడా హైదరాబాద్ పరిసరాల్లోనే ఉన్నాయి. మూడు కంపెనీలో ఈ ప్రాంతానికి చెందినవే కావడం పట్ల ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మేక్ ఇన్ ఇండియా సత్తా చాటాలని పలువురు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.