సద్దుమణిగిన సరిహద్దు విభేదాలు!

న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు విభేదాలు సద్దుమణిగినట్టు కనిపిస్తున్నాయి. ఇరుదేశాల సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణాత్మక వాతావరణాన్ని ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించారు. ఈ నేపథ్యంలో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్‌లోయ పెట్రోలింగ్ పాయింట్ 14,15 ప్రాంతాలతో పాటు మరో చోట మోహరించిన భారత్, చైనా బలగాలు వెనక్కి వెళ్లాయని సమాచారం. కాగా, సరిహద్దు వివాదంపై ఈ వారాంతంలో రెండు దేశాల భద్రతా అధికారులు మరోసారి చర్చలు జరపనున్నారు. ఇప్పటికే ఇరుదేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు […]

Update: 2020-06-09 08:19 GMT

న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు విభేదాలు సద్దుమణిగినట్టు కనిపిస్తున్నాయి. ఇరుదేశాల సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణాత్మక వాతావరణాన్ని ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించారు. ఈ నేపథ్యంలో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్‌లోయ పెట్రోలింగ్ పాయింట్ 14,15 ప్రాంతాలతో పాటు మరో చోట మోహరించిన భారత్, చైనా బలగాలు వెనక్కి వెళ్లాయని సమాచారం. కాగా, సరిహద్దు వివాదంపై ఈ వారాంతంలో రెండు దేశాల భద్రతా అధికారులు మరోసారి చర్చలు జరపనున్నారు. ఇప్పటికే ఇరుదేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు ఈ నెల 6 చర్చలు జరిపిన విషయం తెలిసిందే

Tags:    

Similar News