చరిత్ర సృష్టించిన అశ్విన్.. @600 వికెట్లు
దిశ, వెబ్‌డెస్క్: మోతేరా వేదికగా జరుగుతున్న పింక్ బాల్ రెండో టెస్టులో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసాయి. 81 పరుగులకే ఆలౌటైంది.ఈ ఇన్నింగ్స్‌లో అక్షర్ 5, అశ్విన్ 4 వికెట్లు తీశారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ అశ్శిన్ అరుదైన రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో అత్యంత వేగంగా 600 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. మొత్తం ఆయన కెరీర్‌లలో.. వన్డేలు, టీ20లు, టెస్టులతో కలిపి 234 మ్యాచ్‌లు ఆడగా.. మొత్తంగా 600 వికెట్లు […]
దిశ, వెబ్‌డెస్క్: మోతేరా వేదికగా జరుగుతున్న పింక్ బాల్ రెండో టెస్టులో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసాయి. 81 పరుగులకే ఆలౌటైంది.ఈ ఇన్నింగ్స్‌లో అక్షర్ 5, అశ్విన్ 4 వికెట్లు తీశారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ అశ్శిన్ అరుదైన రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో అత్యంత వేగంగా 600 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. మొత్తం ఆయన కెరీర్‌లలో.. వన్డేలు, టీ20లు, టెస్టులతో కలిపి 234 మ్యాచ్‌లు ఆడగా.. మొత్తంగా 600 వికెట్లు తీసి అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అంతేగాకుండా టెస్టు క్రికెట్‌లో 400 వికెట్లు తీసిన 4వ ఇండియన్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేగాక, ఈ ఫీట్‌తో టెస్టుల్లో అత్యంత వేగంగా 77 మ్యాచుల్లోనే 400 వికెట్లు పడగ్గొట్టిన ప్రపంచ 2వ బౌలర్‌గా నిలిచాడు.