క్షీణించిన ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నికర లాభం!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గృహ రుణాల సంస్థ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (Indiabulls Housing Finance) 2020-21 ఆర్థిక సంవత్సరానికి తొలి త్రైమాసికంలో నికర లాభం 65.96 శాతం క్షీణించి రూ. 272.84 కోట్లకు చేరింది. గతేడాది జూన్‌తో ముగిసిన ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 801.53 కోట్లుగా నమోదైంది. అలాగే, కంపెనీ కార్యకలాపాల ఆదాయం 33.7 శాతం తగ్గి రూ. 2,574.6 కోట్లకు చేరిందని, గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కార్యకలాపాల […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గృహ రుణాల సంస్థ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (Indiabulls Housing Finance) 2020-21 ఆర్థిక సంవత్సరానికి తొలి త్రైమాసికంలో నికర లాభం 65.96 శాతం క్షీణించి రూ. 272.84 కోట్లకు చేరింది. గతేడాది జూన్‌తో ముగిసిన ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 801.53 కోట్లుగా నమోదైంది. అలాగే, కంపెనీ కార్యకలాపాల ఆదాయం 33.7 శాతం తగ్గి రూ. 2,574.6 కోట్లకు చేరిందని, గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కార్యకలాపాల ఆదాయం రూ. 3,885 కోట్లని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
వ్యక్తిగత గృహ రుణాలు, రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రాజెక్ట్ ఫైనాన్స్ అందించడంలో ముందున్నప్పటికీ, ఈ విభాగాలపై కొవిడ్-19 ప్రభావం అధికంగా ఉందని కంపెనీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇటీవల ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఎస్ ఎస్ ముంద్రాను కంపెనీ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమించింది. ముంద్రా ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా 2018లో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ బోర్డులో చేరారు. అలాగే, సంస్థ లిస్టెడ్ కంపెనీ ఇండియాబుల్స్ వెంచర్స్‌కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న సమీర్ గెహ్లాట్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించినట్టు కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.