2050 నాటికి మూడో అతిపెద్ద దిగుమతి దేశంగా భారత్..

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దిగుమతుల్లో 5.9 శాతం వాటాతో 2050 నాటికి భారత్ మూడో అతిపెద్ద దిగుమతిదారుగా అవతరిస్తుందని యూకేకు చెందిన అంతర్జాతీయ వాణిజ్య విభాగం అభిప్రాయపడింది. చైనా, అమెరికా తర్వాత భారత్ ఆ స్థానానికి చేరుకుంటుందని వాణిజ్య విభాగం తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం భారత్ 2.8 శాతంతో అతిపెద్ద దిగుమతి దేశాల జాబితాలో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతోందని, 2030 నాటికి 3.9 శాతం వాటాతో నాలుగో స్థానానికి చేరుకుంటుందని ‘గ్లోబల్ ఔట్‌లుక్’ పేరుతో విడుదల […]

Update: 2021-09-20 10:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దిగుమతుల్లో 5.9 శాతం వాటాతో 2050 నాటికి భారత్ మూడో అతిపెద్ద దిగుమతిదారుగా అవతరిస్తుందని యూకేకు చెందిన అంతర్జాతీయ వాణిజ్య విభాగం అభిప్రాయపడింది. చైనా, అమెరికా తర్వాత భారత్ ఆ స్థానానికి చేరుకుంటుందని వాణిజ్య విభాగం తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం భారత్ 2.8 శాతంతో అతిపెద్ద దిగుమతి దేశాల జాబితాలో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతోందని, 2030 నాటికి 3.9 శాతం వాటాతో నాలుగో స్థానానికి చేరుకుంటుందని ‘గ్లోబల్ ఔట్‌లుక్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ప్రపంచ దిగుమతుల డిమాండ్‌లో ఆసియా ప్రాంతం మధ్యతరగతి వర్గాల్లో పెరుగుతున్న కొనుగోలు శక్తి కారణంగా అమెరికా, యూరోపియన్, యూనియన్ దేశాల దిగుమతుల వాటా 2030 నాటికి తగ్గుతుందని నివేదిక పేర్కొంది.

ప్రధానంగా ఈ మార్పు ఆహారం, ప్రయాణం, డిజిటల్ సేవల రంగాల్లో ఉంటుందని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న సంపన్న జనాభా వస్తువులు, సేవల వినియోగంలో మార్పు ఉంటుందని నివేదిక భావిస్తోంది. అంతేకాకుండా ప్రపంచ జీడీపీలో 6.8 శాతం వాటాతో చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థల జాబితాలో 2050 నాటికి భారత్ మూడో స్థానంలో ఉంటుదని నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం భారత్ ఐదో స్థానంలో ఉండగా, 2030 నాటికి జర్మనీని అధిగమించి నాలుగో స్థానానికి చేరుకుంటుందని వెల్లడించింది.

Tags:    

Similar News