బార్డర్ లో టెన్షన్ టెన్షన్.. కూలిన భారత ఫైటర్ జెట్
దిశ, వెబ్ డెస్క్: సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజస్తాన్ లోని భారత్ పాక్ సరిహద్దు వద్ద భారత్ కు చెందిన మిగ్-21 ఫైటర్ జెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే అది సాంకేతిక లోపం వల్ల కూలిందా, లేక ఉగ్రవాదులు కూల్చేశారా అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. గస్తీ కాస్తున్న ఈ ఫైటర్ జెట్ కూలిపోవడంతో వదంతులు వేగంగా వ్యాప్తి చెందాయి. సమాచారం అందుకున్న భారత ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. పంజాబ్ లో […]
దిశ, వెబ్ డెస్క్: సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజస్తాన్ లోని భారత్ పాక్ సరిహద్దు వద్ద భారత్ కు చెందిన మిగ్-21 ఫైటర్ జెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే అది సాంకేతిక లోపం వల్ల కూలిందా, లేక ఉగ్రవాదులు కూల్చేశారా అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. గస్తీ కాస్తున్న ఈ ఫైటర్ జెట్ కూలిపోవడంతో వదంతులు వేగంగా వ్యాప్తి చెందాయి.
సమాచారం అందుకున్న భారత ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. పంజాబ్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన దగ్గరి నుంచి నిఘా వర్గాలు భారత ఆర్మీని హెచ్చరిస్తూనే ఉన్నాయి. తాజాగా మిగ్-21 కూలి పోవడంతో వారి అనుమానాలకు మరింత బలం చేకూరినట్టు అయిందని విశ్లేషకులు అంటున్నారు.