ఫేస్‌బుక్‌లో ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా – ఇండియా మధ్య శుక్రవారం ప్రారంభమైన వన్డే సిరీస్‌తో పాటు టీ20 సిరీస్‌ను ప్రసారం చేయడానికి ఫేస్‌బుక్, సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ మధ్య ఒప్పందం కుదిరింది. టీమ్ ఇండియా మ్యాచ్‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యక్ష ప్రసారం కావడం ఇదే మొదటి సారి. ఫేస్‌బుక్‌కు చెందిన ఫేస్‌బుక్ వాచ్‌లో వీడియో ఆన్ డిమాండ్ పేరుతో ఈ సర్వీసులను అందించనున్నది. కేవలం లైవ్ మ్యాచ్‌లే కాకుండా మ్యాచ్ హైలైట్స్, ఇన్-ప్లే మూమెంట్స్, బెస్ట్ […]

Update: 2020-11-28 10:08 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా – ఇండియా మధ్య శుక్రవారం ప్రారంభమైన వన్డే సిరీస్‌తో పాటు టీ20 సిరీస్‌ను ప్రసారం చేయడానికి ఫేస్‌బుక్, సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ మధ్య ఒప్పందం కుదిరింది. టీమ్ ఇండియా మ్యాచ్‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యక్ష ప్రసారం కావడం ఇదే మొదటి సారి. ఫేస్‌బుక్‌కు చెందిన ఫేస్‌బుక్ వాచ్‌లో వీడియో ఆన్ డిమాండ్ పేరుతో ఈ సర్వీసులను అందించనున్నది.

కేవలం లైవ్ మ్యాచ్‌లే కాకుండా మ్యాచ్ హైలైట్స్, ఇన్-ప్లే మూమెంట్స్, బెస్ట్ క్యాచెస్, బెస్ట్ వికెట్స్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వంటి క్లిప్స్‌ను కూడా ఫేస్‌బుక్ ప్రసారం చేయనున్నది. ఇవన్నీ సోనీ స్పోర్ట్స్ ఇండియాకు చెందిన ఫేస్‌బుక్ పేజీలో వీక్షించవచ్చని ఇరు సంస్థలు ప్రకటించాయి. కాగా, టెస్టు మ్యాచ్‌లకు సంబంధించి మాత్రం ఇంకా ఒప్పందం కుదరలేదని సోనీ నెట్‌వర్క్ తెలిపింది.

Tags:    

Similar News