2021-22లో ఆర్థికవ్యవస్థ రెండంకెల వృద్ధి!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్న భారత ఆర్థికవ్యవస్థ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 10 శాతంతో రెండంకెల వృద్ధిని నమోదు చేస్తుందని డెలాయిట్ తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలు ప్రతికూల సంకేతాలను ఎదుర్కొంటుండటంతి పీఎమై తయారీ సూచీ 2008 స్థాయిలో అత్యధికంగా ఉందని ‘వాయిస్ ఆఫ్ ఆసియా’ పత్రంలో డెలాయిట్ పేర్కొంది. అన్‌లాక్ అనంతరం పండుగ సీజన్ మద్దతుతో కార్ల అమ్మకాలు, జీఎస్టీ వసూళ్లు పెరగడం, ఉక్కు, డీజిల్ వినియోగంలో వృద్ధితో ఆర్థికవ్యవస్థ బౌన్స్ […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్న భారత ఆర్థికవ్యవస్థ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 10 శాతంతో రెండంకెల వృద్ధిని నమోదు చేస్తుందని డెలాయిట్ తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలు ప్రతికూల సంకేతాలను ఎదుర్కొంటుండటంతి పీఎమై తయారీ సూచీ 2008 స్థాయిలో అత్యధికంగా ఉందని ‘వాయిస్ ఆఫ్ ఆసియా’ పత్రంలో డెలాయిట్ పేర్కొంది. అన్‌లాక్ అనంతరం పండుగ సీజన్ మద్దతుతో కార్ల అమ్మకాలు, జీఎస్టీ వసూళ్లు పెరగడం, ఉక్కు, డీజిల్ వినియోగంలో వృద్ధితో ఆర్థికవ్యవస్థ బౌన్స్ అయ్యిందని తెలిపింది.
కరోనా కేసుల పెరుగుదల కొనసాగితే వచ్చే ఏడాది ఇప్పుడు సాధిస్తున్న వృద్ధికి సవాలుగా ఉంటుందని డెలాయిట్ నివేదిక అభిప్రాయపడింది. ఏదేమైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కుదేలైన తర్వాత 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు’ వెల్లడించింది. వృద్ధి పురోగతికి ముఖ్యంగా ఉద్యోగాల్లో పెరుగుదల, బలమైన సేవల రంగం పుంజుకోవడ, ప్రైవేట్ రంగంలో డిమాండ్ స్థిరత్వం దోహదపడనుందని పేర్కొంది.