అగ్ని ప్రైమ్ విజయవంతం

న్యూఢిల్లీ: అగ్ని శ్రేణీ క్షిపుణుల్లో అడ్వాన్స్ వర్షన్, అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్నిప్రైమ్ బాలిస్టిక్ క్షిపణిని భారత్ సోమవారం విజయ వంతంగా ప్రయోగించింది. భువనేశ్వర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి సోమవారం ఉదయం 10 గంటల 55 నిమిషాలకు అగ్ని ప్రైమ్‌ను విజయవంతంగా ప్రయోగించినట్టు డీఆర్‌డీఏ వెల్లడించింది. ఇది కంపోజిట్ మెటీరియల్స్‌తో తయారు చేయబడిన తర్వాతి తరం మిస్సైల్ అని పేర్కొంది. అగ్ని3తో పోలిస్తే 50శాతం తక్కువ బరువును కలిగి […]

Update: 2021-06-28 11:19 GMT

న్యూఢిల్లీ: అగ్ని శ్రేణీ క్షిపుణుల్లో అడ్వాన్స్ వర్షన్, అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్నిప్రైమ్ బాలిస్టిక్ క్షిపణిని భారత్ సోమవారం విజయ వంతంగా ప్రయోగించింది. భువనేశ్వర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి సోమవారం ఉదయం 10 గంటల 55 నిమిషాలకు అగ్ని ప్రైమ్‌ను విజయవంతంగా ప్రయోగించినట్టు డీఆర్‌డీఏ వెల్లడించింది. ఇది కంపోజిట్ మెటీరియల్స్‌తో తయారు చేయబడిన తర్వాతి తరం మిస్సైల్ అని పేర్కొంది. అగ్ని3తో పోలిస్తే 50శాతం తక్కువ బరువును కలిగి వుంటుందని తెలిపింది. 1000 కేజీల వరకు అణ్వాయుధాలను మోసుకుపోయే సామర్థ్యం దీని సొంతమని చెప్పింది. 1000 నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదని వెల్లడించింది.

Tags:    

Similar News