ఇతర దేశాల వలే పాక్‌తోనూ అదే కోరుకుంటాం : భారత్

న్యూఢిల్లీ : భారత్ పొరుగు దేశాలన్నింటితో కోరుతున్నట్టే పాకిస్తాన్‌తోనూ సాధారణ సంబంధాలనే ఆశిస్తున్నదని భారత్ ఐరాస జనరల్ అసెంబ్లీలో వివరించింది. అందుకు తగిన వాతావరణాన్ని కల్పించే బాధ్యత దాయాది దేశానిదేనని పేర్కొంది. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద శిబిరాలకు ఆ దేశ భూభాగాలను వినియోగించడానికి అనుమతించకూడదని డిమాండ్ చేసింది. టెర్రర్, హింస లేని, శాంతియుత వాతావరణంలో ఉభయ దేశాల మధ్య సమస్యను ద్వైపాక్షి సంబంధాలకు లోబడి పరిష్కరించుకోవాలన్నది తమ అభిప్రాయమని భారత శాశ్వత కమిషనర్ ఆరు మధుసూదన్ తెలిపారు. […]

Update: 2021-06-12 10:58 GMT

న్యూఢిల్లీ : భారత్ పొరుగు దేశాలన్నింటితో కోరుతున్నట్టే పాకిస్తాన్‌తోనూ సాధారణ సంబంధాలనే ఆశిస్తున్నదని భారత్ ఐరాస జనరల్ అసెంబ్లీలో వివరించింది. అందుకు తగిన వాతావరణాన్ని కల్పించే బాధ్యత దాయాది దేశానిదేనని పేర్కొంది. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద శిబిరాలకు ఆ దేశ భూభాగాలను వినియోగించడానికి అనుమతించకూడదని డిమాండ్ చేసింది.

టెర్రర్, హింస లేని, శాంతియుత వాతావరణంలో ఉభయ దేశాల మధ్య సమస్యను ద్వైపాక్షి సంబంధాలకు లోబడి పరిష్కరించుకోవాలన్నది తమ అభిప్రాయమని భారత శాశ్వత కమిషనర్ ఆరు మధుసూదన్ తెలిపారు. అంతుకు ముందు పాక్ ప్రతినిధి జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తగా భారత్ కొట్టిపారేసింది. అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదారి పట్టించే పాక్ వ్యాఖ్యలు ఐరాస నిబంధనలకు విరుద్ధమైనవని, భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ముందు నుంచే హితవు చేస్తున్నట్టు వివరించారు.

Tags:    

Similar News