ఇండియాకు 150 కోట్ల డాలర్లు ఇవ్వనున్న ఏడీబీ!

కొవిడ్-19 వైరస్‌ను నిలువరించేందుకు ఇండియాకు సాయంగా ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) 150 కోట్ల డాలర్లు ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా వైరస్‌ను అరికట్టడానికి, నివారణ చర్యల కోసం, ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజలకు సహాయ కార్యక్రమాలు నిర్వహించడానికి భారత ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఖర్చుపెట్టనుంది. కోవిడ్ -19 వ్యాప్తిని నిరోధించేందుకూ, ఆర్థికంగా బలహీన వర్గాల రక్షణ వంటి వాటి కోసం భారతదేశానికి 150 కోట్ల డాలర్ల రుణం ఇవ్వడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) మంగళవారం అంగీకరించిందని […]

Update: 2020-04-28 09:29 GMT

కొవిడ్-19 వైరస్‌ను నిలువరించేందుకు ఇండియాకు సాయంగా ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) 150 కోట్ల డాలర్లు ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా వైరస్‌ను అరికట్టడానికి, నివారణ చర్యల కోసం, ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజలకు సహాయ కార్యక్రమాలు నిర్వహించడానికి భారత ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఖర్చుపెట్టనుంది. కోవిడ్ -19 వ్యాప్తిని నిరోధించేందుకూ, ఆర్థికంగా బలహీన వర్గాల రక్షణ వంటి వాటి కోసం భారతదేశానికి 150 కోట్ల డాలర్ల రుణం ఇవ్వడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) మంగళవారం అంగీకరించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.

స్వయం సహాయక సంఘాలకు ఐవోబీ రుణాలు:

స్వయం సహాయక బృందాలకు ప్రత్యేక రుణ పథకాన్ని ప్రవేశ పెట్టినట్టు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు(ఐవోబీ) వెల్లడించింది. కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో ఈ పథకాన్ని తెచ్చామని బ్యాంకు వెల్లడించింది. బృందంలోని ఒక సభ్యుడికి రూ. 5,000లకు మించకుండా, ఒక బృందానికి రూ. లక్షకు మించకుండా రుణాలివ్వనున్నారు. ఐవోబీ నుంచి రెండు రుణాలు తీసుకుని, సక్రమంగా చెల్లించిన బృందాలు ఈ పథకం ద్వారా జూన్ 30లోగా రుణాలు పొందవచ్చు.

Tags : Covid19, Asian Development Bank, ADB, IOB

Tags:    

Similar News