మళ్లీ అదరగొట్టిన జడ్డూ… భారత్ స్కోర్ @161

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో తడబడ్డ టీమిండియా, పొట్టి ఫార్మాట్‌లోనూ అదేవిధంగా సతమతమవుతోంది. కాన్‌బెర్రా వేదికగా జరుగుతున్న తొలి టీ20లో ఆసీస్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆటగాళ్లు మళ్లీ తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 161 పరుగులు చేసింది. ఓపెనర్‌గా క్రీజ్‌లో అడుగుపెట్టిన కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 51 పరుగులు […]

Update: 2020-12-04 04:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో తడబడ్డ టీమిండియా, పొట్టి ఫార్మాట్‌లోనూ అదేవిధంగా సతమతమవుతోంది. కాన్‌బెర్రా వేదికగా జరుగుతున్న తొలి టీ20లో ఆసీస్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆటగాళ్లు మళ్లీ తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 161 పరుగులు చేసింది. ఓపెనర్‌గా క్రీజ్‌లో అడుగుపెట్టిన కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 51 పరుగులు చేశాడు. ఆ తరువాత విరాట్(8), మనీష్ పాండే(2), సంజు శ్యామ్సన్ (23), హార్ధిక్ పాండ్య(7), పరుగులకే పెవీలియన్ చేరి మళ్లీ కష్టాల్లో నెట్టారు. చివర్లో రవీంద్ర జడేజా 44 పరుగులు సాధించి భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించి.. ఆసీస్‌కు 162 పరుగుల లక్ష్యాన్ని విధించారు. మరి బౌలింగ్‌లో ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News