ప్యాంగాంగ్ సరస్సులో అత్యాధునిక పడవలు

దిశ, వెబ్‌డెస్క్: యుద్ధమంటూ వస్తే చైనాను అన్ని వైపులా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇండియా అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు కయ్యానికి కాలుదువ్వుతున్న డ్రాగన్‌ను కట్టడి చేసేందుకు భారత్ సమాయత్తమవుతోంది.అందుకోసం ఇప్పటికే యుద్ధట్యాంకులు, ఎయిర్ క్రాఫ్టులు, యాంటీ మిసైల్ సిస్టమ్‌ను కూడా బోర్డర్ లో మొహరించింది. అయితే, బోర్డర్లో ఉన్న ప్యాంగ్యాంగ్ సరస్సు పై చైనా ఆధిపత్యం చెలాయించేందుకు కొత్త వ్యూహలు రచిస్తోంది.ఈ సరస్సు 134 కిలోమీటర్ల పొడవు ఉండగా, 70 శాతం టిబెట్ […]

Update: 2020-07-02 11:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: యుద్ధమంటూ వస్తే చైనాను అన్ని వైపులా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇండియా అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు కయ్యానికి కాలుదువ్వుతున్న డ్రాగన్‌ను కట్టడి చేసేందుకు భారత్ సమాయత్తమవుతోంది.అందుకోసం ఇప్పటికే యుద్ధట్యాంకులు, ఎయిర్ క్రాఫ్టులు, యాంటీ మిసైల్ సిస్టమ్‌ను కూడా బోర్డర్ లో మొహరించింది.

అయితే, బోర్డర్లో ఉన్న ప్యాంగ్యాంగ్ సరస్సు పై చైనా ఆధిపత్యం చెలాయించేందుకు కొత్త వ్యూహలు రచిస్తోంది.ఈ సరస్సు 134 కిలోమీటర్ల పొడవు ఉండగా, 70 శాతం టిబెట్ ఆధీనంలో ఉన్నది. ఆ ప్రాంతమంతా చైనా అధీనంలో ఉన్నందున ప్యాంగ్యాంగ్ సరస్సు పై తన ఆధిపత్యం చెలాయిస్తోంది.ఇప్పటికే ఆ సరస్సులో అత్యాధునిక మరపడవల సహాయంతో చైనా పహారా కాస్తున్నది.

భారత్ పై చైనా ప్యాంగ్యాంగ్ సరస్సు పై నుంచి దాడులు చేసే అవకాశం ఉందని భావించిన కేంద్రం అక్కడ కూడా పటిష్ట నిఘాను ఏర్పాటు చేసుకుంటోంది. ప్రస్తుతం అక్కడ 2013 కాలం నాటి పడవలను భారత్ వాడుతున్నది. వాటి స్థానంలో కొత్తగా అధునాతన పడవలను సిద్ధం చేయాలని కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఆ పడవలను సీ17 విమానం ద్వారా లడఖ్ ఎయిర్ బేస్‌కు, అక్కడి నుంచి ట్రక్కుల ద్వారా ప్యాంగ్యాంగ్ సరస్సుకు చేర్చేలా ప్లాన్ చేస్తున్నది. కేంద్రం నిర్ణయంతో త్వరలోనే అధునాతమైన మర పడవలు గస్తీ సైన్యానికి అందుబాటులోకి రానున్నాయి.

Tags:    

Similar News