ఇళ్ల ధరల సూచీలో అట్టడుగున భారత్..

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభం కారణంగా దేశీయ గృహ నిర్మాణ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. దేశీయంగా గృహ విక్రయాల మార్కెట్లో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు పరిశ్రమ వర్గాలు అనేక ప్రయత్నాలను కొనసాగిస్తుండగా, కరోనా ప్రతికూల ప్రభావం వల్ల భారత్‌లో సగటున ఇళ్ల ధరలు 1.6 శాతం తగ్గినట్టు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే భారత్ ఈ జాబితాలో 12 స్థానాలు దిగజారిందని నైట్‌ఫ్రాంక్ తెలిపింది. 2020లో అంతర్జాతీయ గృహ రేట్ల సూచీలో భారత్ […]

Update: 2021-06-10 10:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభం కారణంగా దేశీయ గృహ నిర్మాణ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. దేశీయంగా గృహ విక్రయాల మార్కెట్లో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు పరిశ్రమ వర్గాలు అనేక ప్రయత్నాలను కొనసాగిస్తుండగా, కరోనా ప్రతికూల ప్రభావం వల్ల భారత్‌లో సగటున ఇళ్ల ధరలు 1.6 శాతం తగ్గినట్టు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే భారత్ ఈ జాబితాలో 12 స్థానాలు దిగజారిందని నైట్‌ఫ్రాంక్ తెలిపింది.

2020లో అంతర్జాతీయ గృహ రేట్ల సూచీలో భారత్ 43వ ర్యాంకును నమోదు చేయగా, ఈ ఏడాది 55 ర్యాంకుకు పడిపోయింది. మొత్తం 56 దేశాల్లో ఇళ్ల ధరలను పరిశీలించిన నైట్‌ఫ్రాంక్ భారత్‌లో ఇళ్ల ధరల సగటు ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో 2015 నాటి స్థాయికి దిగజారినట్టు అభిప్రాయపడింది. దేశీయంగా సగటు ఇళ్ల ధరల మార్పుల్లో కోల్‌కతాలో అధికంగా 4 శాతం పెరగ్గా, పూణె, ముంబైల్లో 3 శాతం చొప్పున, బెంగళూరులో 1 శాతం పెరిగాయి. హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 1 శాతం క్షీణించాయి.

 

Tags:    

Similar News