చరిత్ర సృష్టించిన టీమిండియా
దిశ, వెబ్‌డెస్క్: గబ్బా వేదికగా జరిగిన ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. డూ ఆర్ డై మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించి భారత్ జాతీయ పతకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. యువ క్రికెటర్ల పోరాట పటిమతో బోర్డర్–గవాస్కర్ ట్రోఫీని వరుసగా రెండోసారి దక్కించుకుని ఆస్ట్రేలియాపై తమదే పైచేయి అని నిరూపించింది. ఈ సందర్భంగా ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను భారత్ మట్టికరిపించింది. 1988 తర్వాత బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో తొలిసారి కంగారులకు ఓటమి […]
దిశ, వెబ్‌డెస్క్: గబ్బా వేదికగా జరిగిన ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. డూ ఆర్ డై మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించి భారత్ జాతీయ పతకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. యువ క్రికెటర్ల పోరాట పటిమతో బోర్డర్–గవాస్కర్ ట్రోఫీని వరుసగా రెండోసారి దక్కించుకుని ఆస్ట్రేలియాపై తమదే పైచేయి అని నిరూపించింది. ఈ సందర్భంగా ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను భారత్ మట్టికరిపించింది. 1988 తర్వాత బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో తొలిసారి కంగారులకు ఓటమి రుచి చూపించి, చరిత్ర సృష్టించింది. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 02-01తో భారత్ కైవసం చేసుకుంది. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వరుసగా మూడోసారి భారత్ సొంతమైంది. ఇన్నేళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో టీమిండియా టెస్టు విజయం అందుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ క్రికెటర్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.