వెయ్యికి పైగా అమెరికా సంస్థలు ఇండియాకు రానున్నాయా!?

దిశ, వెబ్‌డెస్క్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు..కరోనా వ్యాప్తి చైనా నష్టాలకు దారితీస్తోంది. చైనా అంటేనే మండిపోతున్న ట్రంప్ ధోరణితో చైనాలోని అమెరికన్ కంపెనీలు దుకాణాలను సర్దే పనిలో ఉన్నట్టు తెలిసిందే…దీన్ని ఆసరాగా అమెరికా కంపెనీలను ఇండియాకు ఆహ్వానించేందుకు మోదీ ప్రభుత్వం వ్యూహాలను సిద్ధం చేస్తోంది. చైనాలో మూటాముల్లే సర్దుకోవాలని చూస్తున్న దాదాపు 1000 కి పైగా అమెరికా ఉత్పత్తి సంస్థలను కేంద్ర ప్రభుత్వం సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ఇన్సెంటివ్‌లను కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం. వీటిలో […]

Update: 2020-05-07 04:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు..కరోనా వ్యాప్తి చైనా నష్టాలకు దారితీస్తోంది. చైనా అంటేనే మండిపోతున్న ట్రంప్ ధోరణితో చైనాలోని అమెరికన్ కంపెనీలు దుకాణాలను సర్దే పనిలో ఉన్నట్టు తెలిసిందే…దీన్ని ఆసరాగా అమెరికా కంపెనీలను ఇండియాకు ఆహ్వానించేందుకు మోదీ ప్రభుత్వం వ్యూహాలను సిద్ధం చేస్తోంది. చైనాలో మూటాముల్లే సర్దుకోవాలని చూస్తున్న దాదాపు 1000 కి పైగా అమెరికా ఉత్పత్తి సంస్థలను కేంద్ర ప్రభుత్వం సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ఇన్సెంటివ్‌లను కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం. వీటిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, లెదర్, వైద్య పరికరాల సరఫరా కంపెనీలు, టెక్స్‌టైల్స్, ఆటో రంగం విడిభాగాల తయారీ కంపెనీలకు ఇండియా అధిక ప్రాధాన్యం ఇస్తోందని సమాచారం.

ఒక దగ్గరే వద్దట..

ఇక, అమెరికా పెద్దన్న ట్రంప్ చైనా పేరు వినగానే భగ్గుమంటున్నారు. కరోనాను అరికట్టడంలో చైనా ఘోరంగా విఫలమైందని ట్రంప్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. కరోనాకు ముందు అంతంత మాత్రం సంబంధాలతో ఉన్న ఇరుదేశాలు పన్నుల విషయం సానుకూల ఒప్పందానికి జనవరిలో చర్చలు జరిపాయి. ఒక్కసారిగా కరోనా విజృంభించడంతో ఆ మాత్రం సంబంధాలు మరింత దిగజారాయి. కరోనా పరిణామాలతో చైనాలోని అనేక సంస్థలు తమ ఉత్పత్తి కార్యకలాపాలను ఒక దగ్గరే కేంద్రీకరించేందుకు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. చైనాలో ఉన్న ఫ్యాక్టరీలను సొంత దేశానికి తెచ్చేయడానికి జపాన్ ఇప్పటికే 2.2 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, యూరప్ దేశాలు సైతం చైనా నుంచి దిగుమతులను తగ్గించుకోవాలని భావిస్తున్నాయి.

తరలింపు సులభం..

కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా అమెరికా సంస్థలైన హెల్త్‌కేర్ ఉత్పత్తులు, పరికరాల కంపెనీలు ఇండియాకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు భావిస్తోంది. అబోట్ ల్యాబరేటరీస్, మెడ్ ట్రోనిక్ లాంటి కంపెనీలు తమ యూనిట్లను ఇండియాకు తరలించేందుకు చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు సంస్థలకు సంబంధించిన కార్యకలాపాలు ఉన్నందున చైనా నుంచి ఉత్పత్తి యూనిట్లను తరలించే విషయంలో సంస్థలకు ప్రక్రియ సులభతరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కార్మిక చట్టాల్లో మార్పులకు సై…

ఇక, అమెరికా, చైనా, జపాన్‌లతో పోల్చిస్తే..ఇండియాలో భూములను తక్కువ ధరకే సేకరించే అవకాశముందని, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి లభిస్తుందని అధికారులు సంస్థలను ఆకర్షిస్తున్నారు. దీనికోసం ఇండియా కార్మిక చట్టాలను మార్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సంస్థలకు చెబుతున్నాయి. ఇదివరకే చైనాలోని అనేక కంపెనీలు వియత్నాం, థాయ్‌లాండ్ వంటి దేశాలవైపు మొగ్గు చూపాయి. ఇండియాలో పరిస్థితులో ఆ దేశాలకంటే సానుకూలంగా ఉండటం, ఇక్కడి మార్కెట్ కూడా పెద్దది కావడంతో సంస్థలు ఇండియాకు తరలే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

అవకాశాలను వదలొద్దు…

మహారాష్ట్రతో సహా కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఉన్నప్పటికీ విదేశీ తయారీదారులకు సరఫరా వ్యవస్థ కొనసాగుతున్నాయి. దక్షిణాన తమిళనాడు, ఉత్తరాన ఉత్తరప్రదేశ్ వంటి చోట్ల తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సంస్థలకు రాయితీలు కూడా ఇచ్చారు. “అనువైన భూముల కోసం వెతుకుతున్న అమెరికా సంస్థల వద్ద సమృద్ధిగా మూలధనం ఉంది. ఇండియా దీన్ని అవకాశంగా మలుచుకోవాల్సి ఉందని వాషింగ్టన్ ఆధారిత యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్షిప్ ఫోరమ్ అధ్యక్షుడు ముఖేష్ అన్నారు.

Tags: China, American Companies, Covid-19, Coronavirus, India, Donald Trump

Tags:    

Similar News