ఫైనల్‌లోకి దూసుకెళ్లిన ఇండియా లెజెండ్స్

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్.. బిగ్‌బాష్.. పీఎస్ఎల్.. ఏ లీగ్‌కు కూడా తీసిపోని మ్యాచ్‌కు రాయ్‌పూర్‌ వేదికైంది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2021లో భాగంగా బుధవారం రాత్రి వెస్టిండీస్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ లెజెండ్స్ చివరి వరకు పోరాడారు. కానీ చివర్లో వినయ్ కుమార్, ఇర్ఫాన్ పఠాన్ వేసిన అద్బుతమైన బౌలింగ్‌తో విండీస్ ఓటమి పాలైంది. టాస్ […]

Update: 2021-03-17 12:19 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్.. బిగ్‌బాష్.. పీఎస్ఎల్.. ఏ లీగ్‌కు కూడా తీసిపోని మ్యాచ్‌కు రాయ్‌పూర్‌ వేదికైంది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2021లో భాగంగా బుధవారం రాత్రి వెస్టిండీస్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ లెజెండ్స్ చివరి వరకు పోరాడారు. కానీ చివర్లో వినయ్ కుమార్, ఇర్ఫాన్ పఠాన్ వేసిన అద్బుతమైన బౌలింగ్‌తో విండీస్ ఓటమి పాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా లెజెండ్స్ దూకుడుగా ఆడారు. వీరేంద్ర సెహ్వాగ్ (35) సహజశైలిలో ఆడాడు. తొలి వికెట్‌కు సచిన్‌తో కలసి సెహ్వాగ్ 56 పరుగులు జోడించాడు. సెహ్వాగ్ అవుటైన తర్వాత సచిన్ (65), కైఫ్ (27) పరుగుల వేగం పెంచారు. కైఫ్ 109 వద్ద, టెండుల్కర్ 140 పరుగుల వద్ద అవుటయ్యారు. ఆ తర్వాత యూసుఫ్ పఠాన్, యువరాజ్ సింగ్ కలసి విండీస్ బౌలర్లను చితకబాదారు. పఠాన్ కేవలం 20 బంతుల్లో 37 పరుగులు సాధించగా.. యువరాజ్ 20 బంతుల్లో 49 పరుగులు కొట్టాడు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఇండియా లెజెండ్స్ 3 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది.

219 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ లెజెండ్స్‌కు శుభారంభం దక్కలేదు. గోనీ బౌలింగ్‌లో ఓపెనర్ విలియమ్ పెర్కిన్స్ (9) అవుటయ్యాడు. అయితే డ్వేన్ స్మిత్, నర్సింగ్ దియోనరైన్ కలసి ఇండియా బౌలర్లను చితకబాదారు. వీరిద్దరూ కలసి రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఇర్ఫాన్ పఠాన్ విడదీశాడు. డ్వేన్ స్మిత్(63) ఇర్ఫాన్ బౌలింగ్‌లో యూసుఫ్ పఠాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ వెంటనే కిర్క్ ఎడ్వర్డ్స్ (0) ప్రజ్ఞాన్ ఓజా బౌలింగ్‌లో కీపర్ నమన్ ఓజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక కెప్టెన్ బ్రియన్ లారా చెలరేగిపోయాడు. నర్సింగ్‌తో కలసి 80 పరుగుల భాగస్వామ్యం అందించాడు. బ్రియన్ లారా కేవలం 28 బంతుల్లో 46 పరుగులు జోడించాడు. అయితే 19వ ఓవర్‌లో వినయ్ కుమార్.. లారాను క్లీన్ బౌల్డ్ చేశాడు. చివరి ఓవర్లో ఇర్ఫాన్ పఠాన్ నర్సింగ్ (59) ను అవుట్ చేశాడు. దీంతో వెస్టిండీస్ లెజెండ్స్ లక్ష్యానికి 12 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇండియా లెజెండ్స్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. గురువారం జరుగనున్న రెండో సెమీస్‌లో శ్రీలంక, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడనున్నాయి.

స్కోర్ బోర్డు క్లుప్తంగా

ఇండియా లెజెండ్స్ 218/3
వెస్టిండీస్ లెజెండ్స్ 206/6

Tags:    

Similar News