మనదేశంలో 50శాతం మంది చేతులు కడుక్కోరు?

దిశ వెబ్ డెస్క్: కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రథమంగా మనం చేయాల్సింది హ్యాండ్ వాషింగ్. నీరు లేదా సబ్బుతో చేతులు కడుక్కోవడం లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్తో చేతులు రబ్ చేసుకోవాలి. అయితే చాలా మంది దీన్ని పాటిస్తున్నా.. ఇంకెంతోమంది చేతులు కడుక్కోవడం లేదు. సాధారణంగా కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. దీన్ని కూడా మన వాళ్లు విస్మరిస్తున్నారు. మల విసర్జన అనంతరం, భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం వల్ల 40 శాతం […]

Update: 2020-03-27 04:30 GMT

దిశ వెబ్ డెస్క్: కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రథమంగా మనం చేయాల్సింది హ్యాండ్ వాషింగ్. నీరు లేదా సబ్బుతో చేతులు కడుక్కోవడం లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్తో చేతులు రబ్ చేసుకోవాలి. అయితే చాలా మంది దీన్ని పాటిస్తున్నా.. ఇంకెంతోమంది చేతులు కడుక్కోవడం లేదు. సాధారణంగా కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. దీన్ని కూడా మన వాళ్లు విస్మరిస్తున్నారు. మల విసర్జన అనంతరం, భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం వల్ల 40 శాతం అతిసారం, డయేరియా, 25 శాతం శ్వాస సంబంధిత వ్యాధులు రావు. కానీ మన దేశంలో సగం మందికి చేతులను శుభ్రం చేసుకునే అలవాటు లేదు. 63 దేశాల్లో ‘వరెస్ట్‌ హ్యాండ్‌ వాషింగ్‌ కల్చర్‌’ పేరుతో ఓ అంతర్జాతీయ సంస్థ సర్వేచేసి ఆ దేశాల జాబితాను ప్రకటించింది. భారత జనాభాలో 50 శాతం మంది చేతులను శుభ్రం చేసుకోవడం లేదని తేలడంతో.. మన దేశం పదో స్థానంలో నిలిచింది.

కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు ప్రధానంగా చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు. జనాలూ దీన్ని పాటిస్తున్నారు. పరిశుభ్రత చర్యల్లో భాగంగా సబ్బుతోనో.. శానిటైజర్‌తోనో చేతులను గంటకో గంటన్నరకో ఒకసారి శుభ్రం చేసుకుంటున్నారు. అయితే సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడానికి 20 సెకన్లకు మించి సమయం పట్టదు. ఇంత తక్కువ సమయంలోనే చేతులను పక్కాగా శుభ్రం చేసుకోవచ్చని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌కు చెందిన వైద్యులు అంటున్నారు. అయితే చాలామంది 5 సెకన్లకు మించి చేతులు కడగడం లేదట! రెస్ట్‌రూమ్‌ను ఉపయోగించిన తరువాత 5 శాతం మంది 15 సెకన్ల కన్నా ఎక్కువ సమయాన్ని చేతులు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. 10 శాతం మంది చేతులు శుభ్రం చేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదట!చేతులు శుభ్రం చేసుకునే సమయంలో పైపైన కాకుండా చేతి వేళ్ల మధ్య కూడా శుభ్రం చేసుకోవాలని, అప్పుడే వైరస్‌ పూర్తిగా తొలగిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.కొందరు వేడి నీళ్లతో శుభ్రం చేసుకుంటే అన్ని క్రిములు చనిపోతాయని అనుకుంటున్నారు. కానీ వేడి నీళ్లు క్రిములపై ప్రభావం చూపించవని అంటున్నారు నిపుణులు.చేతులు శుభ్రం చేసుకోగానే సరిపోదు. పొడి తువ్వాలుతో తుడుచుకోవాలి. చేతులు తడిగా ఉంటే వైరస్‌ మళ్లీ వ్యాపించే అవకాశం ఉంటుంది. చేతులు ఆరబెట్టుకోవడానికి బ్లోయర్స్‌ను ఉపయోగిస్తే మరీ మంచిది.చేతులు శుభ్రం చేసుకున్న తరువాత కుళాయిని ఆపు చేయడానికి నేరుగా చేతులను కాకుండా, టిష్యూ పేపర్‌ను ఉపయోగించాలి. చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవడం మేలు. ఆల్కహాల్‌ ఉన్న శానిటైజర్స్‌ను కూడా ఉపయోగించవచ్చు. 60 శాతం ఆల్కహాల్‌ ఉన్న శానిటైజర్లు కరోనా వైరస్‌ను నిర్మూలిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

చైనానే మొదటి స్థానం:

63 దేశాల్లో ‘వరెస్ట్‌ హ్యాండ్‌ వాషింగ్‌ కల్చర్‌’ పేరుతో చేసిన సర్వేలో టాప్‌గా ఉన్న దేశమేదంటే.. కరోనా వైరస్‌ పుట్టిన చైనానే! ఆ దేశంలో 77శాతం మందికి చేతులను కడుక్కునే అలవాటే లేదట. చైనా తర్వాత జపాన్‌, దక్షిణ కొరియాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అయితే ఇవన్నీ వరెస్ట్ రికార్డులు. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో సౌదీ అరేబియా వాసులే ప్రపంచానికి ఆదర్శమని ఈ సర్వే తేల్చింది. ఇక మన దేశం… పదో స్థానంలో నిలిచింది.

Tags : HAND WASH, CORONA VIRUS, INDIA, CHINA, JAPAN, SOAP, SANITIZER, WORST HAND WASHING CULTURE

Tags:    

Similar News