కశ్మీర్ హిల్‌పై తొలి ‘ఇగ్లూ కేఫ్’

దిశ, వెబ్‌డెస్క్ : మంచుప్రాంతాల్లో మంచుతో నిర్మించే ఇళ్లనే ‘ఇగ్లూ’గా పిలుస్తామని మనం సోషల్ పుస్తకాల్లో చదివాం. ఎస్కిమోలు వీటిల్లో జీవించేవాళ్లు. అయితే ఈ తరహా కట్టడాలను ఆర్కిటిక్ ప్రాంతాల్లో, మంచు ప్రాంత దేశాల్లోనే ఎక్కువగా చూసేవాళ్లం. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో 2017లో ‘ఇగ్లూ’లను నిర్మించగా, దేశంలో తొలి ఇగ్లూ హోటల్‌నూ ఇటీవల ప్రారంభించారు. తాజాగా కశ్మీర్‌లోని గుల్మర్గ్‌లోనూ ‘ఇగ్లూ కేఫ్’ అందుబాటులోకి వచ్చింది. కశ్మీర్‌లోని ఫేమస్ స్నో హిల్ స్టేషన్‌ ‘గుల్మర్గ్’. చలికాలంలో హిమపాత అందాలతో శ్వేతవర్ణంలో […]

Update: 2021-01-28 04:35 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మంచుప్రాంతాల్లో మంచుతో నిర్మించే ఇళ్లనే ‘ఇగ్లూ’గా పిలుస్తామని మనం సోషల్ పుస్తకాల్లో చదివాం. ఎస్కిమోలు వీటిల్లో జీవించేవాళ్లు. అయితే ఈ తరహా కట్టడాలను ఆర్కిటిక్ ప్రాంతాల్లో, మంచు ప్రాంత దేశాల్లోనే ఎక్కువగా చూసేవాళ్లం. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో 2017లో ‘ఇగ్లూ’లను నిర్మించగా, దేశంలో తొలి ఇగ్లూ హోటల్‌నూ ఇటీవల ప్రారంభించారు. తాజాగా కశ్మీర్‌లోని గుల్మర్గ్‌లోనూ ‘ఇగ్లూ కేఫ్’ అందుబాటులోకి వచ్చింది.

కశ్మీర్‌లోని ఫేమస్ స్నో హిల్ స్టేషన్‌ ‘గుల్మర్గ్’. చలికాలంలో హిమపాత అందాలతో శ్వేతవర్ణంలో మెరిసిపోయే ఈ ప్రాంతం భూతల స్వర్గాన్న తలపించేలా ఉంటుంది. ‘ఇగ్లూ కేఫ్’ ఈ టూరిస్ట్ స్పాట్‌కు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొల్హాయ్ రిసార్ట్ యాజమాని, హోటలియర్ వసీమ్ షా ఆలోచనల్లో ఇగ్లూ కేఫ్ పురుడుపోసుకుంది. 22 ఫీట్ల వెడల్పుతో, 13 ఫీట్ల ఎత్తుతో నిర్మించగా, దీన్ని రూపొందించడానికి 15 రోజుల సమయం పట్టింది ఈ కేఫ్‌లోని టేబుల్స్, ఇంటీరియర్ డిజైనింగ్, చెయిర్స్ ఐస్‌తోని రూపొందించినవి కావడం విశేషం. నాలుగు టేబుల్స్ గల ఈ కేఫ్‌లో ఒకేసారి 16 మంది కస్టమర్లు కూర్చొవచ్చు. ‘బేసిక్‌గా నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం కావడంతో వీలైనప్పుడల్లా పలు దేశాలు వెళ్తుంటాను. ఆ క్రమంలో స్విట్జర్లాండ్‌లో ‘ఇగ్లూ కేఫ్’లను చూసి, మన దగ్గర ఎందుకు ఇలాంటి హోటల్ ప్రారంభించొద్దనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశాను. ఇది సందర్శకులకు తప్పకుండా కొత్త అనుభూతిని అందిస్తుంది. గుల్మర్గ్‌లో ఇదే తొలి మంచు హోటల్. భవిష్యత్తులో ఈ తరహా హోటల్స్ మరిన్ని వచ్చే అవకాశముంది’ అని వసీం అన్నాడు. స్విస్‌తో పాటు కెనడా, ఫిన్లాండ్‌లోనూ ఇగ్లూ కేఫ్‌లు కనిపిస్తాయి. ఇక గుల్మర్గ్‌తో పాటు, ఇప్పటికే మనాలిలోని ఇగ్లూ హోటల్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. అక్కడ ఏటా వింటర్ సీజన్‌లో ఇగ్లూలను నిర్మిస్తుండగా, అవి ఏప్రిల్‌ వరకు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. ఇగ్లూలో ఉండేందుకు ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉండగా డే అండ్ నైట్ కోసం రూ.5,500 చార్జీ చేస్తుండగా, పగటి వేళ మాత్రమే ఉండేందుకు పెద్దలకు రూ.1,500, పిల్లలకు రూ.1,200 చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఎక్కువరోజులు అక్కడ గడింపేందుకు వీలుగా ఇతర ప్యాకేజ్‌లు అందుబాటులో ఉన్నాయి.

Tags:    

Similar News