మాంద్యం నుంచి బయటపడ్డ ఆర్థికవ్యవస్థ!
దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్థికవ్యవస్థ వేగంగా పుంజుకుంటోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వరుస రెండు త్రైమాసికాల క్షీణత తర్వాత సానుకూల వృద్ధిని నమోదు చేసింది. సుద్ధీర్ఘమైన లాక్‌డౌన్ అనంతరం ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవడం, కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుండటంతో జీడీపీ సాంకేతిక మాంద్యం నుంచి బయటపడింది. 2020-21 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 23.9 శాతం ప్రతికూలంగా నమోదైంది. […]
దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్థికవ్యవస్థ వేగంగా పుంజుకుంటోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వరుస రెండు త్రైమాసికాల క్షీణత తర్వాత సానుకూల వృద్ధిని నమోదు చేసింది. సుద్ధీర్ఘమైన లాక్‌డౌన్ అనంతరం ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవడం, కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుండటంతో జీడీపీ సాంకేతిక మాంద్యం నుంచి బయటపడింది. 2020-21 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 23.9 శాతం ప్రతికూలంగా నమోదైంది.
జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో వేగంగా రికవరీ బాట పట్టిన ఆర్థికవ్యవస్థ 7.5 శాతం ప్రతికూలానికి పరిమితమైంది. అనంతరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో అంచనాలను నిజం చేస్తూ సానుకూల వృద్ధిని నమోదు చేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో భారత జీడీపీ 0.4 శాతం వృద్ధిని సాధించింది. 2020-21లో మూడో త్రైమాసికంలో వృద్ధిని సాధించిన అతికొద్ది ప్రధాన ఆర్థికవ్యవస్థలలో భారత్ ఒకటి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8 శాతం ప్రతికూలత నమోదవచ్చని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ఓ ప్రకటనలో తెలిపింది.