లాక్‌డౌన్ వల్ల ఇప్పటివరకు జరిగిన నష్టమెంత!

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాప్తిని తగ్గించేందుకు విధించిన లాక్‌డౌన్ 2.0 ముగింపు గడువు దగ్గర పడుతోంది. అయితే, దేశంలో కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గకపోగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తారా లేదా ఎత్తివేస్తారా అనేది ఆసక్తికరమైన చర్చ. ఒకవేళ లాక్‌డౌన్‌ను పొడిగిస్తే గనక దాని ప్రభావాన్ని దేశం భరించగలిగే పరిస్థితి ఉందా అనే మరో ప్రశ్న సిద్ధంగా ఉంది. లాక్‌డౌన్ వల్ల ఆర్థికంగా కావాల్సినన్ని ఇబ్బందులు నెత్తికెత్తుకున్నాం. ప్రజలందరూ 34 రోజుల లాక్‌డౌన్‌లో […]

Update: 2020-04-29 04:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాప్తిని తగ్గించేందుకు విధించిన లాక్‌డౌన్ 2.0 ముగింపు గడువు దగ్గర పడుతోంది. అయితే, దేశంలో కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గకపోగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తారా లేదా ఎత్తివేస్తారా అనేది ఆసక్తికరమైన చర్చ.

ఒకవేళ లాక్‌డౌన్‌ను పొడిగిస్తే గనక దాని ప్రభావాన్ని దేశం భరించగలిగే పరిస్థితి ఉందా అనే మరో ప్రశ్న సిద్ధంగా ఉంది. లాక్‌డౌన్ వల్ల ఆర్థికంగా కావాల్సినన్ని ఇబ్బందులు నెత్తికెత్తుకున్నాం. ప్రజలందరూ 34 రోజుల లాక్‌డౌన్‌లో ఉండటంతో దేశ జీడీపీకి 10.2 లక్షల కోట్ల నుంచి రూ. 13.6 లక్షల కోట్ల వరకు నష్టం వాటిల్లిందనేది ఓ అంచనా. అంతేగాక, ఇప్పటికే చాలా ఉద్యోగాలు పోగా, రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలపైనా తీవ్ర ప్రభావం పడనుంది. మార్చి నాటికే 26 శాతానికి పైగా ఉన్న నిరుద్యోగ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు విధించడం మూలంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక రోజుకు రూ.30 వేల కోట్ల నుంచి 40 వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. అంతేనా 37.3 కోట్ల మంది శ్రామికులు రోజుకు రూ.10 వేల కోట్ల వరకూ తమ ఆదాయాన్ని కోల్పోతున్నారు. ఇప్పటివరకు లాక్‌డౌన్ వల్ల 34 రోజుల్లో రూ.2.4 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మే 3 వరకూ అంటే 40 రోజుల తర్వాత కూడా లాక్‌డౌన్‌ను పొడిగిస్తే కరోనాను తరిమేయవచ్చేమో కానీ జీడీపీపై ప్రభావం అధికంగా పడే అవకాశం ఉంది. లాక్‌డౌన్ దెబ్బకు సుమారు 10 కోట్ల మంది ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉన్నట్టు సమాచారం. గత్యంతరం లేక లాక్‌డౌన్‌ను మరో 4 వారాలు పొడిగిస్తే 25 శాతం సూక్ష్మ, మధ్యతరహా సంస్థలు మూసివేయక తప్పదు. ఒకవేళ .. ఇంకో 8 వారాలు ఇదే పరిస్థితి ఉంటే 43 శాతం ఎంఎస్ఎంఈలు కనుమరుగు కానున్నాయి.

కరోనా పెద్ద సంక్లిష్టతను దేశం, దేశ ప్రజలముందు ఉంచింది. కరోనా ఒకవైపుంటే, దానివల్ల ఆర్థిక వ్యవస్థకు ఏర్పడే నష్టం మరొకటి. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కొనసాగిస్తుందా? పొడిగిస్తే పర్యవసానంగా ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టం ఉంటుందనేది అంచనా వేయలేం. కాబట్టి, పరిస్థితులకు అనుగుణంగా గ్రీన్ జోన్ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు మాత్రమే కేంద్ర సడలించే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags : coronavirus, covid-19, indian economy, gdp, growth, economy

Tags:    

Similar News