పెట్టుబడుల ఉపసంహరణకు ఇది మంచి సమయమే : నీతి ఆయోగ్
దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థికవ్యవస్థ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో మెరుగుపడే అవకాశాలున్నాయని నీతి ఆయోగ్ వైస్-ఛైర్మన్ రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. దేశీయ పరిస్థితులు చాలా పటిష్ఠంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో పెట్టుబడుల ఉపసంహరణకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. మరిన్ని నిధులను సమీకరించడం ద్వారా ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచుకునేందుకు సరైన సమయంగా భావించవచ్చని, దీనివల్ల రానున్న రోజుల్లో ప్రైవేట్ పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారేందుకు వీలవుతుందని రాజీవ్ కుమారు వివరించారు. ఇప్పటికే స్టీల్, […]
దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థికవ్యవస్థ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో మెరుగుపడే అవకాశాలున్నాయని నీతి ఆయోగ్ వైస్-ఛైర్మన్ రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. దేశీయ పరిస్థితులు చాలా పటిష్ఠంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో పెట్టుబడుల ఉపసంహరణకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. మరిన్ని నిధులను సమీకరించడం ద్వారా ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచుకునేందుకు సరైన సమయంగా భావించవచ్చని, దీనివల్ల రానున్న రోజుల్లో ప్రైవేట్ పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారేందుకు వీలవుతుందని రాజీవ్ కుమారు వివరించారు.
ఇప్పటికే స్టీల్, సిమెంట్, రియల్ ఎస్టేట్ వంటి పలు రంగాల్లో విస్తరణ సామర్థ్యంతో గణనీయమైన పెట్టుబడులు వచ్చి చేరాయని, వినియోగదారుల రంగంలో అనిశ్చితి కొనసాగుతుండటం కొంత సంకోచించే అంశమని రాజీవ్ కుమారు చెప్పారు. ‘పూర్తిస్థాయిలో ప్రైవేట్ పెట్టుబడుల రికవరీ 2022-23 మూడో త్రైమాసికంలో ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. ఇదే సమయంలో ఇప్పటికే కొవిడ్-19 మహమ్మారి థర్డ్ వేవ్ గురించి హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అయితే, ఇదివరకే రెండు సార్లు మహమ్మారి పరిస్థితులు ఎదుర్కొన్న భారత్ మరోసారి కరోనా ప్రతికూలతను సమర్థవంతంగా అధిగమించగలదనే నమ్మకం ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనాను నియంత్రించేందుకు కావాల్సిన అన్ని సవాళ్లను చూసి ఉండటంతో మొత్తంగా భారత్ మెరుగైన స్థితిలో ఉందని భావించవచ్చన్నారు.