కొత్తగా 8 మందికి.. 119కి చేరిన కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. సోమవారం మరో ఆరుగురికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో నలుగురికి, కేరళలో ఇద్దరికి, కర్ణాటక, ఒడిశాలో ఒక్కరికి చొప్పున ఇద్దరికి ఆ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 119కు చేరుకుంది. ఇప్పటివరకు కర్ణాటక, ఢిల్లీ, ఒడిశాలో ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు మృతిచెందారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 37 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో […]
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. సోమవారం మరో ఆరుగురికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో నలుగురికి, కేరళలో ఇద్దరికి, కర్ణాటక, ఒడిశాలో ఒక్కరికి చొప్పున ఇద్దరికి ఆ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 119కు చేరుకుంది. ఇప్పటివరకు కర్ణాటక, ఢిల్లీ, ఒడిశాలో ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు మృతిచెందారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 37 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో 27 కేసులతో కేరళ రాష్ట్రం ఉంది. సోమవారం ఒడిశాలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇప్పటివరకు నమోదైన మొత్తం 119 కేసుల్లో భారతీయులు 101 మంది ఉన్నారు. విదేశీయులు 18 మంది ఉండగా, ఇద్దరు మృతిచెందారు. 10 మందికి కరోనా తగ్గిపోవడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. హర్యానాలో నమోదైన 14 కేసుల్లో అందరూ విదేశీయులే కావడం గమనార్హం.
tags : covid19, coronavirus in india, corona death counts