టెస్టు చాంపియన్‌‎షిప్‌లో ఇండియా అగ్రస్థానం

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమ్ఇండియా విజయం సాధించడంతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ రేసులో అగ్రస్థానానికి చేరుకుంది. టీమ్ఇండియా పాయింట్లతోపాటు విజయాల శాతం కూడా పెరగడంతో రెండోస్థానం నుంచి మొదటి స్థానానికి చేరుకుంది. టీమ్ఇండియా విజయాల శాతం 70.00 నుంచి 71.10 శాతానికి పెరిగింది. రెండో స్థానంలో న్యూజీలాండ్ (70 శాతం) ఉండగా, మూడో స్థానానికి ఆస్ట్రేలియా పడిపోయింది. ఆస్ట్రేలియా విజయాల శాతం 69.2గా ఉంది. నాలుగో స్థానంలో ఇంగ్లండ్ (65.2) కొనసాగుతున్నది. మరోవైపు […]

Update: 2021-01-19 07:17 GMT

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమ్ఇండియా విజయం సాధించడంతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ రేసులో అగ్రస్థానానికి చేరుకుంది. టీమ్ఇండియా పాయింట్లతోపాటు విజయాల శాతం కూడా పెరగడంతో రెండోస్థానం నుంచి మొదటి స్థానానికి చేరుకుంది. టీమ్ఇండియా విజయాల శాతం 70.00 నుంచి 71.10 శాతానికి పెరిగింది. రెండో స్థానంలో న్యూజీలాండ్ (70 శాతం) ఉండగా, మూడో స్థానానికి ఆస్ట్రేలియా పడిపోయింది. ఆస్ట్రేలియా విజయాల శాతం 69.2గా ఉంది. నాలుగో స్థానంలో ఇంగ్లండ్ (65.2) కొనసాగుతున్నది. మరోవైపు టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మెరుగుపడింది. మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. న్యూజీలాండ్ జట్టు టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నది.

Tags:    

Similar News