భారత్ – చైనా ఆధిపత్యపు ఆట!
ఏ విషయం గురించైనా జనాలకు కొంచెం తెలిస్తే చాలు.. మొత్తం తెలిసినట్లుగా భావించి తమ అభిప్రాయాలు, నిర్ణయాలను వెల్లడిస్తుంటారు. కానీ ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోవడానికి ముందు కావాల్సినవి అభిప్రాయాలు కాదు.. అనుభవాలు. కానీ ఇప్పటికిప్పుడు అన్నీ అనుభవించేసి అభిప్రాయాన్ని చెప్పడం కొద్దిగా కష్టమే. ఈ క్రమంలో భారత్ – చైనాల మధ్య గొడవల గురించి కూడా అనుభవాలను పట్టించుకోకుండానే తమ అభిప్రాయాలు వినిపిస్తుంటారు. అయితే అందరిలానే మనం కూడా విచ్చలవిడిగా అభిప్రాయాలను వ్యక్తపరిచే ముందు.. […]
ఏ విషయం గురించైనా జనాలకు కొంచెం తెలిస్తే చాలు.. మొత్తం తెలిసినట్లుగా భావించి తమ అభిప్రాయాలు, నిర్ణయాలను వెల్లడిస్తుంటారు. కానీ ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోవడానికి ముందు కావాల్సినవి అభిప్రాయాలు కాదు.. అనుభవాలు. కానీ ఇప్పటికిప్పుడు అన్నీ అనుభవించేసి అభిప్రాయాన్ని చెప్పడం కొద్దిగా కష్టమే. ఈ క్రమంలో భారత్ – చైనాల మధ్య గొడవల గురించి కూడా అనుభవాలను పట్టించుకోకుండానే తమ అభిప్రాయాలు వినిపిస్తుంటారు. అయితే అందరిలానే మనం కూడా విచ్చలవిడిగా అభిప్రాయాలను వ్యక్తపరిచే ముందు.. కాస్త విషయ పరిజ్ఞానాన్ని అలవవరుచుకోవడం ముఖ్యం. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాస్పద పరిస్థితులపై తమ అనుభవాలను రంగరించి ప్రముఖులు రాసిన కొన్ని పుస్తకాల వివరాలు మీకోసం..
చైనాస్ ఇండియా వార్ – కొల్లిజన్ కోర్స్ ఆన్ ద రూఫ్ ఆఫ్ వార్
ఈ పుస్తకాన్ని.. ఆసియా ప్రాంతం గురించి పూర్తి అవగాహన ఉన్న జర్నలిస్ట్ బెర్టిల్ లిట్నర్ రాశారు. ఇందులో భారత్ కారణంగా చైనాకు కలిగే లాభాల గురించి మాత్రమే కాకుండా 1962 చైనా – భారత్ యుద్ధానికి సంబంధించిన తెలియని ఎన్నో విషయాలను ఈ పుస్తకంలో ప్రస్తావించారు.
ది గ్రేట్ గేమ్ ఇన్ ద బుద్ధిస్ట్ హిమాలయాస్ – ఇండియా అండ్ చైనాస్ క్వెస్ట్ ఫర్ స్ట్రాటెజిక్ డామినెన్స్
టిబెట్, బుద్ధిజం గురించిన విషయాలను ‘ఫుంచుక్ స్తోబ్దన్’ ఈ పుస్తకంలో వివరించారు. దలైలామా మీద అర్థం లేని కామెంట్లు, డిప్లమాటిక్ పరిస్థితులను ఇందులో లోతుగా పరిచయం చేశారాయన.
ఎ గ్రేట్ క్లామర్ – ఎన్‌కౌంటర్స్ విత్ చైనా అండ్ ఇట్స్ నైబర్స్
పంకజ్ మిశ్రా రాసిన ఈ పుస్తకంలో.. చైనా సమాజం గురించిన వివిధ అంశాలపై వ్యాసాలను పొందుపరిచారు. చైనా గురించి తప్పుగా కాకుండా వారి సంప్రదాయాలు, ధనికమైన పద్ధతుల పట్ల ఈ పుస్తకం ఓ సరికొత్త అవగాహనను ఏర్పరుస్తుంది.
ఇవి కాకుండా పల్లవి అయ్యర్ రాసిన స్మోక్ అండ్ మిర్రర్స్ – యాన్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ చైనా, తన్వి మదన్ రాసిన ఫేట్‌ఫుల్ ట్రయాంగిల్ – హౌ చైనా షేప్‌డ్ అజ్ – ఇండియా రిలేషన్స్ డ్యూరింగ్ ద కోల్డ్ వార్ పుస్తకాలు కూడా భారత్ – చైనా సంబంధాల గురించి ఒక మంచి అవగాహనను ఏర్పరుస్తాయి.