NASA : నాసా మిషన్‌లో భారత సంతతి మహిళ కీ రోల్

దిశ, ఫీచర్స్ : యూఎస్‌ఏలో 30 లక్షల వరకు భారతీయులు నివసిస్తున్నారు. ఇది ఆ దేశ జనాభాలో ఒక శాతం. ఇక అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’లో 8 శాతం ఆసియా వాసులు పనిచేస్తుండగా, అందులో 2 శాతం ఇండియన్స్ నాసా ప్రయోగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పటికే కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ వంటివారు అంతరిక్షానికి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా మరో భారతీయ మహిళా ఇంజనీర్ నాసా అంతరిక్ష ప్రయోగాల్లో కీలక […]

Update: 2021-06-06 01:35 GMT

దిశ, ఫీచర్స్ : యూఎస్‌ఏలో 30 లక్షల వరకు భారతీయులు నివసిస్తున్నారు. ఇది ఆ దేశ జనాభాలో ఒక శాతం. ఇక అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’లో 8 శాతం ఆసియా వాసులు పనిచేస్తుండగా, అందులో 2 శాతం ఇండియన్స్ నాసా ప్రయోగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పటికే కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ వంటివారు అంతరిక్షానికి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా మరో భారతీయ మహిళా ఇంజనీర్ నాసా అంతరిక్ష ప్రయోగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.

భారత సంతతికి చెందిన సుభాషిణి అయ్యర్ (Subashini Iyer).. చంద్రునిపైకి స్పేస్ క్రాఫ్ట్‌ పంపేందుకు నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్‌కు సంబంధించిన రాకెట్ కోర్ స్టేజ్‌ను పర్యవేక్షిస్తోంది. తమిళనాడులోని కోయంబత్తూరులో పుట్టిన సుభాషిణి.. గత రెండేళ్లుగా స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్‌ఎల్‌ఎస్)తో కలిసి పనిచేస్తోంది. కాగా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు గురించి వివరాలను పంచుకుంది. ‘చంద్రుడిపైకి మనం చివరిసారిగా వెళ్లివచ్చి దాదాపు 50 ఏళ్లు అవుతోంది. మళ్లీ చంద్రుడు, అంగారకుడిపైకి మనుషులను తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాం. చంద్రుడి గురించి మరిన్ని విషయాలను కనుగొనేందుకు ‘నాసా ఆర్టెమిస్ లూనార్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రోగ్రామ్’ నూతన ఇన్నోవేటివ్ న్యూ టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. నాసాకు చెందిన కొత్త రాకెట్ స్పేస్ లాంచ్ సిస్టమ్(ఎస్‌ఎల్‌ఎస్).. ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్‌లో వ్యోమగాములను భూమి నుంచి చంద్రుడి కక్ష్యకు క్వార్టర్ మిలియన్ మైల్స్ సమీపానికి పంపనుంది’ అని వెల్లడించింది.

Indiaborn Subashini Iyer has been overseeing the rocket core stage of Nasa’s ambitious project to send a spacecraft to the moon and beyond.

Tags:    

Similar News