భారత్‌లో కొత్తగా 92,071 కేసులు..
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. గడచిన 24 గంటల్లో దేశంలో 92,071 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ ప్రకటించింది. అలాగే, కరోనా బారిన పడి ఒక్కరోజు వ్యవధిలో 1,136 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 79,722 మంది ప్రాణాలు కోల్పోగా.. చికిత్స అనంతరం 37,80,107 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మన […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. గడచిన 24 గంటల్లో దేశంలో 92,071 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ ప్రకటించింది. అలాగే, కరోనా బారిన పడి ఒక్కరోజు వ్యవధిలో 1,136 మంది మృతి చెందారు.
తాజా మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 79,722 మంది ప్రాణాలు కోల్పోగా.. చికిత్స అనంతరం 37,80,107 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మన దేశంలో 9,86,598 యాక్టివ్ కేసుల ఉండగా.. మొత్తం కరోనా కేసుల సంఖ్య 48,46,427కు చేరుకుంది. అటు దేశంలో రికవరీ రేటు 78శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.64శాతంగా ఉంది.