శ్రీలంక-ఇండియా సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు..?

దిశ, స్పోర్ట్స్: ఇండియా-శ్రీలంక సిరీస్‌కు కరోనా దెబ్బ తగిలింది. శ్రీలంక జట్టు ఇంగ్లాండ్‌లోనే కరోనా బారిన పడగా.. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, అనలిస్ట్ జీటీ నిరోశన్ కరోనా బారిన పడ్డారు. దీంతో శ్రీలంక జట్టు క్వారంటైన్ సమయాన్ని మరిన్ని రోజులు పెంచాలని ఆ దేశ క్రికెట్ బోర్డు భావిస్తున్నది. ఇందుకు సంబంధించి ఇప్పటికే బీసీసీఐతో మంతనాలు కూడా జరిపి.. టీమ్ ఇండియా పర్యటన షెడ్యూల్‌లో మార్పులు కావాలని […]

Update: 2021-07-09 11:50 GMT

దిశ, స్పోర్ట్స్: ఇండియా-శ్రీలంక సిరీస్‌కు కరోనా దెబ్బ తగిలింది. శ్రీలంక జట్టు ఇంగ్లాండ్‌లోనే కరోనా బారిన పడగా.. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, అనలిస్ట్ జీటీ నిరోశన్ కరోనా బారిన పడ్డారు. దీంతో శ్రీలంక జట్టు క్వారంటైన్ సమయాన్ని మరిన్ని రోజులు పెంచాలని ఆ దేశ క్రికెట్ బోర్డు భావిస్తున్నది. ఇందుకు సంబంధించి ఇప్పటికే బీసీసీఐతో మంతనాలు కూడా జరిపి.. టీమ్ ఇండియా పర్యటన షెడ్యూల్‌లో మార్పులు కావాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఇంకా చర్చలు జరుగుతుండటంతో షెడ్యూల్ ప్రకటన ఆగిపోయింది. శనివారం శ్రీలంక క్రికెట్ తాజా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నది. జులై 13 నుంచి ప్రారంభం కావల్సిన వన్డే సిరీస్ 17 లేదా 18 నుంచి.. 21 నుంచి ప్రారంభం కావల్సిన టీ20 మ్యాచ్‌లు 24 నుంచి నిర్వహించేందుకు నిర్ణయించినట్లు సమాచారం.

మార్చిన షెడ్యూల్

తొలి వన్డే – జులై 17 లేదా 18
రెండో వన్డే – జులై 19
మూడో వన్డే – జులై 21

తొలి టీ20 – జులై 24
రెండో టీ20 – జులై 25
మూడో టీ20 – జులై 27

Tags:    

Similar News